Top
Batukamma

వీటి కంటే బూతు సినిమాలే నయం.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా

వీటి కంటే బూతు సినిమాలే నయం.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా
X
Highlights

అందరిని కలిపి ఏకి పారేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కంగనా ఈ ఇష్యూతో మరింత హాట్ టాపిక్ అయ్యింది.

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మళ్లీ నోరు తెరిచింది. ఈ సారి బాలీవుడ్ స్టార్స్, OTT ప్లాట్ ఫామ్స్, ఆడియన్స్... అందరిని కలిపి ఏకి పారేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కంగనా ఈ ఇష్యూతో మరింత హాట్ టాపిక్ అయ్యింది.

నవరాత్రి శుభాకాంక్షలు అంటూ erosnow తన ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. కత్రినా కైఫ్, రణ్ వీర్ సింగ్ ఫొటోలతో ఉన్న మీమ్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయంటూ కంగనా ఫైర్ అయ్యింది.

ఓపెన్ మాట్లాడుతుందనే పేరున్న కంగనా.. ఈ ఇష్యూలోనూ చాలా ఓపెన్ గా మాట్లాడింది. OTT ప్లాట్ ఫామ్స్ లో పూర్తిగా అడల్ట్ కంటెంట్ పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండాలంటూ సలహా ఇచ్చింది.

సినిమా అంటే సమాజం చూసే విధంగా, ఇంట్లోని వాళ్లంతా కలిసి చూసేలా ఉండాలని.. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు అలా ఉండటం లేదని అంటోంది కంగనా. పూర్తిగా సెక్సువల్ కంటెంట్, వయోలెన్స్ ఉంటోందని ఫైర్ అయ్యింది. OTTలకు పోర్న్ హబ్ కు పెద్దగా తేడా లేదంటోంది కంగనా.

అయితే.. ఇది OTT ల తప్పు కాదంటోంది కంగనా. అందరు పర్సనల్ గా హెడ్ ఫోన్స్ పెట్టుకుని.. తమ ఫోన్లలో ఒంటరిగా సినిమాలు చూడటానికి అలవాటుపడ్డారని.. అందుకే అలాంటి సినిమాలు వస్తున్నాయని అంటోంది.

మరోవైపు.. నవరాత్రి పూట.. డబుల్ మీనింగ్ డైలాగులతో మీమ్స్ షేర్ చేయడంపై నెటిజన్లు EROS MEDIAపై ఫైర్ అవుతున్నారు.

Next Story
Share it