Top
Batukamma

శ్రీదేవి కూతురితో రాఘవేంద్రరావు పెళ్లి సందడి..!

KUSHI KAPOOR IN PELLI SANDADI
X
Highlights

హీరోయిన్లను అందంగా చూపించడంలో.. వారి అందచందాలను చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా.

KUSHI KAPOOR IN PELLI SANDADI: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(raghavendra rao) కన్ను ఇప్పుడు మరో బ్యూటీపై పడింది. హీరోయిన్లను అందంగా చూపించడంలో.. వారి అందచందాలను చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా.

అలా తనదైన డైరెక్షన్ తో చాలామంది హీరోయిన్లు స్టార్లను చేశాడు. ఎన్నో అద్బుతమైన సినిమాలు చేశాడు. అందులో పెళ్లి సందడి ఒకటి. అయితే.. ఇప్పుడే అదే పెళ్లి సందడి(pelli sandadi) మరోసారి సందడి చేయబోతోందట.

ఇప్పటికే ఈ మూవీ వర్క్ స్టార్ట్ చేశాడు రాఘవేంద్రరావు. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా ఈ సినిమా రాగా.. ఇప్పుడు అతని కుమారుడు రోషన్ హీరోగా పెళ్లి సందడి రాబోతోంది.

ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు సందడి చేయబోతున్నారట. ఇందుకోసం ఏకంగా శ్రీదేవి చిన్నకూతురిపై కన్నేశాడు దర్శకేంద్రుడు. పెద్దగా సినిమాల జోలికి వెళ్లని ఖుషీ కపూర్(kushi kapoor) అందాలతో తెలుగు ప్రేక్షకులను ఖుషీ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట.



ఇప్పటికే ఖుషీ కపూర్ తో డిస్కషన్స్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనే గ్లామర్ తో కైపెక్కించే ఖుషీ..దర్శకేంద్రుడి చేతిలో పడితే క్లిక్ అవ్వడం ఖామయంటున్నారు సినీ లవర్స్.

ఇక.. ఈ మూవీ కోసం ఇప్పటికే మరో మలయాళీ ముద్దుగుమ్మను రెడీ చేశాడు రాఘవేంద్రరావు. సాఫ్ట్ బ్యూటీ మాళవిక నాయర్(malavika nair) ఈ మూవీలో నటించబోతోందట.

ఓ వైపు ఖుషీ కపూర్, మరో వైపు మాళవిక నాయర్ తో ... ప్రేక్షకులకు దర్శకేంద్రుడి ఫుల్ మీల్స్ పక్కా అంటున్నారు.

Next Story
Share it