Top
Batukamma

అయ్యా.. ! చంద్రశేఖర్ యేలేటి.. ఈ ప్రశ్నలకి 'చెక్' పెట్టగలవా?

అయ్యా.. ! చంద్రశేఖర్ యేలేటి.. ఈ ప్రశ్నలకి చెక్ పెట్టగలవా?
X
Highlights

ఈ మధ్య నితిన్ హీరోగా చెక్ సినిమా వచ్చింది. అయిదేళ్ళ తర్వాత చంద్రశేఖర్ యేలేటి నుంచి సినిమా రావడం, మంచి హిట్స్ తో దూసుకుపోతున్న నితిన్ హీరో.. కావడంతో సినిమా మీదా ఆటోమేటిక్ గా బజ్ ఏర్పడింది..

ఈ మధ్య నితిన్ హీరోగా చెక్ సినిమా వచ్చింది. అయిదేళ్ళ తర్వాత చంద్రశేఖర్ యేలేటి నుంచి సినిమా రావడం, మంచి హిట్స్ తో దూసుకుపోతున్న నితిన్ హీరో.. కావడంతో సినిమా మీదా ఆటోమేటిక్ గా బజ్ ఏర్పడింది.. సినిమా విడుదలయ్యాక మంచి టాక్ రావడంతో దూసుకుపోతుంది.

టెర్రరిజం కేసులో అనుకోకుండా అరెస్ట్ అయిన నిందితుడు నితిన్ (ఆదిత్య).. చివరికి జైలు నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఆసలు కథ.. సినిమాని చాలా లాజిక్ గా తీశానని అనుకున్నాడో ఏమో కానీ.. చంద్రశేఖర్ యేలేటి చాలా విషయాల్లో పప్పులో కాలేశాడు. వాస్తవికతని దాటి సర్కస్ చేశాడు. చిన్న చిన్న విషయాలను లైట్ తీసుకొని ప్రేక్షకుల ముందు అడ్డంగా బుక్కయ్యాడు.

తన తెలివి తేటలతో చిన్న చిన్న సైబర్ క్రైమ్స్ చేసుకునే హీరో.. ఓ అమ్మాయి గురించి ఏం తెలియకుండానే లవ్ లో పడడం ఏంటో అర్ధం కాదు. ఇక అతను ఈ టెర్రరిజం కేసులో ఇరుక్కునేందుకు దారి తీసే పరిస్థితులు కూడా అంత నమ్మశక్యంగా అనిపించవు.. ఇక అతనికి ఉరిశిక్ష వేయడం అంటే అంతా ఈజీ మ్యాటర్ కూడా కాదు.. పక్కగా ప్రూఫ్స్ ఉండాలి. ఇదే సినిమాకి సోల్ మరి... అవేంటో కూడా దర్శకుడు గాలికి వదిలేశాడు.

ఇక టెర్రరిజం కేసులో అరెస్ట్ అయిన ఆదిత్యను కోర్టులో హాజరుపరచడానికి తీసుకొస్తారు పోలీసులు. ఆ టైంలో అక్కడో అమ్మాయి, అబ్బాయి చెస్ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ కాస్తా దూరంగా సంకెళ్లతొ నిల్చున హీరో.. ఆ పిల్లాడికి ఎత్తులు చెప్పి గెలిపిస్తాడు. హీరో ఎత్తులకి ఓడిపోయినా ఆ అమ్మాయి చెస్సులో ఛాంపియన్.. హీరో ఎత్తులకి విస్తుపోయి అతనితో చెస్ ఆడాలని అనుకుంటుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన జడ్జ్ గారు ఆడవయ్యా అంటూ ఎంకరేజ్ చేసి మరీ ఆడిస్తాడు. వాస్తవంగా అయితే కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని జడ్జ్ లు చెబుతారు. కానీ ఇక్కడ జడ్జ్ కోర్టు సమయాన్ని వృధా చేస్తాడు.. మరి ఇదేం లాజికో దర్శకుడికే అర్ధం కావాలి.

ఇక సెకండ్ హాఫ్ లో ఇద్దరు ఖైదీలు వచ్చి హీరో పక్కన చేరతారు. అసలు ఆ పాత్రలెందుకో సృష్టించాడో సదరు దర్శకుడికే అర్ధం కావాలి. ఆ పాత్రలు ఎందుకు వచ్చాయో, ఎందుకు పోయాయో అర్ధమే కాదు.. కానీ చాలా సమయాల్లో వారిని చూపించి... చూపించి అసలు వీరు ఎందుకున్నారబ్బా అనే ప్రశ్నను ప్రేక్షకులకి కలగక మానదు..!

చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో లాజికల్ గా.. రియలిస్టిగ్గా చూపించడం, లోపాల్లేని స్క్రీన్ ప్లే రాయడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. మరి ఇంతటీ లాజికల్ మూవీలో అన్నీ లూప్ హోల్స్ ని ఎలా వదిలేశాడో అర్ధం కాదు..

Next Story
Share it