Top
Batukamma

జిందగీలో గింతగనం ఎప్పుడు నవ్వలే.. ఒక్కసారి ఈ 'మెయిల్' చూసేయండి!

జిందగీలో గింతగనం ఎప్పుడు నవ్వలే.. ఒక్కసారి ఈ మెయిల్ చూసేయండి!
X
Highlights

అప్పుడే ఊళ్ళోకి కంప్యూటర్ తెచ్చిన ప్రియదర్శిని దగ్గర కంప్యూటర్ నేర్చుకుంటాడు.. ఈ ప్రాసెస్ లో ఓ మెయిల్ క్రియేట్ చేసుకుంటాడు ఆ యువకుడు..

లాక్ డౌన్ పుణ్యమా అని వెబ్ సిరీస్ లకి మంచి డిమాండ్ ఏర్పడింది. నిజంగా ఓ రెండు మూడు వెబ్ సిరీస్ లు చూస్తే.. రెండున్నర గంటల సినిమా కూడా వెస్ట్ అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ గా, నీట్ గా, బోర్ కొట్టకుండా తీస్తున్నారు. కొత్తగా దర్శకులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చే వాళ్ళ టాలెంట్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.

'కంబాలపల్లి కథలు'.. ఇది వెబ్ సిరీస్.. ఇందులో ఫస్ట్ పార్ట్ 'మెయిల్'.. మొన్న సంక్రాంతి కానుకగా జనవరి12 న అహలో రిలీజ్ అయింది. 2005 లో అప్పుడే పల్లెలకి కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు .. అలాంటి సమయంలో కంప్యూటర్ అంటే వినుడే కానీ ఎప్పుడు చూడని ఓ యువకుడు కంప్యూటర్ నేర్సుకోవాలని అనుకుంటాడు..

అప్పుడే ఊళ్ళోకి కంప్యూటర్ తెచ్చిన ప్రియదర్శిని దగ్గర కంప్యూటర్ నేర్చుకుంటాడు.. ఈ ప్రాసెస్ లో ఓ మెయిల్ క్రియేట్ చేసుకుంటాడు ఆ యువకుడు.. ఆయితే అందులో వచ్చిన ఓ మెయిల్ ఆ యువకుడి జీవితాన్ని మలుపు తిప్పుతుంది.. ఇంతకీ ఆ మెయిల్ ఏంటి అన్నది తెలియాలంటే ఈ 'మెయిల్' చూడాల్సిందే.


ఈ వెబ్ సిరీస్ కి 80 టూ 90 కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు. అందులో నో డౌట్.. కంప్యూటర్ తో వాళ్ళు ఫేస్ చేసిన ప్రతి ఒక్కటీ ఇందులో కనిపిస్తుంది. ఆ కంప్యూటర్ తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ సోల్..

"లోపలకి చెప్పులు వేసుకొని వస్తే కంప్యూటర్ కి వైరస్ ఎక్కుతుంది బయటకు నడువు.. "

వైరస్ అంటే ఎట్లుంటుందన్నా..

కంప్యూటర్ లో ఫైల్స్ ఎక్కువైతే ఫోల్డర్లు రెడ్ కలర్స్ లో చూపిస్తాయి.. అగొ గా రెడ్ కలరే.. వైరస్ .. అంటూ ప్రియదర్శిని చెప్పే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది.

ఆ రెడ్ కలర్ వైరస్ ను తీసేయడానికి పట్నం నుంచి ఓ మెకానిక్ ని తీసుకొస్తే.. అతను అందులోని ఓ రెండు ఫైల్స్ ను డిలీట్ చేసి వైరస్ పోయిందని చెప్పి రూ. 500 తీసుకోవడం పిచ్చిపిచ్చిగా నవ్విస్తుంది.. ఇలా చెప్పుకుంటే పోతే మస్తు ఉన్నాయి.

దీని తర్వాత కంప్యూటర్ నేర్చుకోడానికి వచ్చిన యువకుడికి మెయిల్ రావడం.. ఆ మెయిల్ కోసం తన దోస్త్ తో కలిసి లక్ష రూపాయలు అప్పు చేయడం..ఆ తర్వాత జరిగే సన్నివేశాలు వెబ్ సిరీస్ ని ఇంకో లెవల్ కి తీసుకెళ్తాయి. ఇంత చక్కటి హాస్యం మధ్యలో ఓ అందమైన లవ్ స్టొరీ ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది.


ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ప్రొడ్యూసర్ స్వప్నా దత్ .. ఇలాంటి కథలను ఎంచుకోవడం.. ముందుగా ఆమెకి ఓ హాట్స్ ఆఫ్.. ఇక దర్శకుడు, సినిమాటోగ్రఫర్ ఉదయ్ గుర్రాల ... అతను ఈ వెబ్ సిరీస్ కోసం పెద్దగా కష్టపడింది లేదు అనుకుంటాను.. తన జీవితంలో కంప్యూటర్ తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ను ఉన్నది ఉన్నట్టుగా దించాడని అనిపిస్తుంది..

ఎందుకంటే అంతా సహజంగా పాత్రలు, పాత్రల స్వభావం, మాటలు ఉంటాయి. తెలంగాణ స్లాంగ్ లో కథ నడిపించడం ఇంకో ప్లస్ పాయింట్. చాలా రోజుల తర్వాత ప్యూర్ పల్లెటూరును చూసినట్టు ఉంటుంది. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ నవ్వించడమే కాకుండా గతంలోకి తీసుకెళ్లి మరోసారి ఆ మధుర క్షణాలను గుర్తుచేస్తోంది.



Next Story
Share it