సాఫ్ట్ బ్యూటి పైన కన్నేసిన హాట్ డైరెక్టర్!

ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తీసుకొని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ సినిమాకి 'పెళ్లి సందడి' అనే టైటిల్ ని కన్ఫామ్ చేశారు..
ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తీసుకొని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ సినిమాకి 'పెళ్లి సందడి' అనే టైటిల్ ని కన్ఫామ్ చేశారు.. 1996లో ఇదే టైటిల్ తో రాఘవేంద్రరావు ఓ సినిమాని చేశారు కూడా..
శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి హీరోహీరోయిన్లుగా వచ్చిన పెళ్లి సందడి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. అయితే ఇప్పుడు ఇదే పేరుతో రాఘవేంద్రరావు సినిమాని చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి..
ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ ని ఫైనల్ చేశాడు దర్శకేంద్రుడు .. ఇక హీరోయిన్ గా మాళవిక నాయర్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.. ఇప్పటికే కథా చర్చలు జరగగా, ఆమె కూడా సినిమాకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకి మాళవిక నాయర్ సాఫ్ట్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తూ వచ్చింది..
View this post on InstagramA post shared by Malvika Nair (@malvikanairofficial) on
ఇప్పుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమా అనేసరికి ఇందులో మాళవిక నాయర్ ఎలా కనిపించబోతున్న అనేది ఆసక్తికరంగా మారింది. బేసిక్ గా రాఘవేంద్రరావు సినిమా అనగానే అందరికీ పూలు,పండ్లు, నడుము, బొడ్డు ఇవి మాత్రమే కనిపిస్తుంటాయి.. సినిమాలలో గ్లామర్ షో కి దూరంగా ఉంటూ కేవలం యాక్టింగ్ ని మాత్రమే నమ్ముకున్న మాళవిక నాయర్ ఇందులో ఎలా కనిపిస్తుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్..
View this post on InstagramA post shared by Malavika Nair fans (@malvikanairofficialfanpage) on
ఆర్కా మీడియా వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాధామోహనరావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నాడు.
View this post on InstagramA post shared by Malavika Nair fans (@malvikanairofficialfanpage) on