రోజా పై నాగబాబు పంచ్.. కానీ అదే రివర్స్.. అడ్డంగా బుక్కయ్యాడుగా..!

బుల్లితెర పైన జబర్దస్త్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడెప్పుడో మొదలైన ఈ షో.. ఇప్పటికీ సూపర్ సక్సెస్ తో.. టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ
బుల్లితెర పైన జబర్దస్త్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడెప్పుడో మొదలైన ఈ షో.. ఇప్పటికీ సూపర్ సక్సెస్ తో.. టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ షోకి ముందునుంచి మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్మెల్యే రోజా జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఆ తర్వాత నాగబాబు ఆ షో నుంచి తప్పుకొని.. జీ తెలుగులో 'అదిరింది' లాంటి కామెడీ షోను చేసుకున్నారు. తాజాగా దానికి కూడా గుడ్ బై చెప్పేసి.. సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మనీ ఎర్నింగ్స్ చేస్తున్నారు. ఇక ఇదిలావుండగా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేశారు. నాగబాబు.
నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలపై స్పందిస్తూ ఓపెన్ అయ్యారు. అందులో భాగంగానే మీకు జబర్దస్త్ లో నచ్చే బెస్ట్ కమెడియన్ ఎవరంటే షాకింగ్ జవాబు ఇచ్చారు నాగబాబు.. ఇంకెవరు.. జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న 'రోజా' అంటూ ఆమె ఫోటోను కూడా పోస్ట్ చేశారు నాగబాబు.. సెటైరికల్‌గా నాగబాబు చేసిన ఈ కామెంట్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే నాగబాబు వేసిన పంచ్ కి నెటిజన్లు రివర్స్‌లో ఆయనపైనే కౌంటర్ వేశారు. జడ్జ్ సీటులో కూర్చున్న రోజా కమెడియన్ అయితే.. ఇన్ని రోజులు ఆమెతో కూర్చున్న మీరు కూడా జోకర్ అన్నట్టే కదా? అని కౌంటర్ వేస్తున్నారు. రోజాపైన ఎదో సెటైర్ వద్దామనుకుంటే అదికాస్తా నాగబాబుకి తగిలి అడ్డంగా బుక్కయ్యాడంటూ మెగా బ్రదర్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.
Also Read :
సీఎం జగన్ కు తాగుబోతుల హెచ్చరిక... ఆ బ్రాండ్లు అమ్మకపోతే ఇదే మా చివరి ఓటు..!
దిమ్మతిరిగింది.. !! యువతికి బిగ్ షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. !
Tv5 మూర్తి అసలు పేరేంటి? పెళ్ళెందుకు చేసుకోలేదు.. మహాన్యూస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు?