Top
Batukamma

మెగాస్టార్ కు కరోనా పాజిటివ్

మెగాస్టార్ కు కరోనా పాజిటివ్
X
Highlights

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను

chiranjeevi tested పాజిటివ్ : కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రేటిల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది.. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా చాలా మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు.


అయితే ఇందులో చాలా మంది కోలుకున్నారు.. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది.. ఈ విషయాన్నీ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.

"ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.

చిరంజీవికి కరోనా అనే విషయం తెలియగానే మెగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు.. అయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్ధిస్తున్నారు.. ఇక అటు చిరంజీవి తమ్ముడు నాగబాబుకి కరోనా సోకి కోలుకున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it