Top
Batukamma

ఆ సినిమా క్లైమాక్స్ చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్య.. క్షమాపణలు కోరిన డైరెక్టర్

ఆ సినిమా క్లైమాక్స్ చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్య.. క్షమాపణలు కోరిన డైరెక్టర్
X
Highlights

సొసైటీ పైన సినిమా ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. సినిమాలో వచ్చిన సన్నివేశాలనో లేకపోతే సినిమాలో హీరో స్టైల్ నో అభిమానులు ఫాలో అవుతుంటారు.. శివ సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజ్ కుర్రాళ్ళంతా సైకిల్ చైన్ పట్టుకొని రోడ్లమీద తిరిగేవారు..

సొసైటీ పైన సినిమా ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. సినిమాలో వచ్చిన సన్నివేశాలనో లేకపోతే సినిమాలో హీరో స్టైల్ నో అభిమానులు ఫాలో అవుతుంటారు.. శివ సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజ్ కుర్రాళ్ళంతా సైకిల్ చైన్ పట్టుకొని రోడ్లమీద తిరిగేవారు..అప్పుడది ట్రెండ్.. ఇక పోకిరి సినిమా కుర్రాల మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్ ను మార్చేసింది.. ఇలా చెప్పుకుంటే పోతే మొన్న వచ్చిన అర్జున్ రెడ్డి వరకు చాలానే సినిమాలు ఉన్నాయి.

కానీ ఓ సినిమాని చూసి ఓ 20 జంటలు ఏకంగా ఆత్మహత్యనే చేసుకున్నాయి. అంతలా వారిపైన ప్రభావం చూపించింది ఆ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. కమల్ హాసన్, సరిత హీరోహీరోయిన్లుగా కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మరోచరిత్ర మూవీ.. 1978లో వచ్చిన ఈ చిత్రం దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఈ సినిమాని యూత్ లెక్కలేనన్ని సార్లు చూసారు.

పెద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ ట్రాజెడీ ఉంటుంది.. సినిమా చివర్లో తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని హీరోహీరయిన్లు ఇద్దరు సూసైడ్ చేసుకుంటారు. సినిమాని చూసిన ప్రతి ఒక్కరినీ ఈ సీన్ ఎడిపిస్తుంది. ధియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మనల్ని వెంటాడుతుంది. అంతలా కనెక్ట్ అవుతుంది ఆ సీన్.

అయితే ఈ సీన్ చాలా మంది ప్రేమికులను కదిలించడంతో దాదాపుగా 20 జంటలు తమ ప్రేమకి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందు వారు రాసిన సూసైడ్ లేటర్లో మరోచరిత్ర మూవీ గురించి ప్రస్తావించే వారు.

అప్పుడు ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ కావడంతో మానవ హక్కుల సంఘాలు, అభ్యుదయ సంఘాలు దర్శకుడు బాలచందర్ ను తిట్టడం మొదలు పెట్టాయి.. దీనితో మరోచరిత్ర మూవీ 200 రోజుల ఫంక్షన్ లో బాలచందర్ ఈ సినిమాని తీసినందుకు క్షమాపణలు కోరారు.. ఇది తాను చేసిన పొరపాటని అన్నారు. ఇంకోసారి యూత్ ను ప్రభావితం చేసే సినిమాలను తాను చేయనని అన్నారు బాలచందర్.

Also Read : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!

చెప్పేది శ్రీరంగ నీతులు.. వేసుకునేవి సగం బట్టలు!

అందంతో పిచ్చెక్కిస్తున్న ఈ 'జబర్దస్త్' పిల్ల ఎవరో తెలుసా?



Next Story
Share it