Top
Batukamma

బిగ్ బాస్ లో నాగార్జున వర్సెస్ హారిక..!

బిగ్ బాస్ లో నాగార్జున వర్సెస్ హారిక..!
X
Highlights

బిగ్ బాస్ లో హారికకు షాక్ తగిలింది. దీంతో దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి... ఏడుపు అందుకుంది

‌బిగ్ బాస్ లో హారికకు షాక్ తగిలింది. దీంతో దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి... ఏడుపు అందుకుంది ఈ యూట్యూబ్ బ్యూటీ. కెప్టెన్సీ విషయంలో నాగార్జున చేసిన కామెంట్స్ హారిక షాక్ అయ్యింది.

హౌస్ లో బెస్ట్ కెప్టెన్ హారిక అని.. వరస్ట్ కెప్టెన్ అరియానా అని ఇప్పటి వరకు చెప్పుకున్నారు. కానీ నాగార్జున మాత్రం దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోనని తేల్చి చెప్పాడు. అరియానా వరస్ట్ క్యాప్టెన్ అసలే కాదన్నాడు. ఇటు హారికను బెస్ట్ క్యాప్టెన్ అంటే ఒప్పుకునేది లేదన్నాడు.


శనివారం నాగార్జున స్టేజ్ పైకీ ఎంట్రీ ఇవ్వగానే మొదట హారికతోనే మొదలెట్టాడు. హారికను కన్ఫెషన్ రూంలోకి పిలిచి పంచాయితీ పెట్టాడు. వారం రోజులుగా నడుస్తున్న తతంగాన్ని విప్పి చూపించాడు. వారం రోజుల్లో చేసిన తప్పులన్నింటిని చూపించాడు.

అప్పటి దాకా బిగ్ బాస్ హౌస్ లో తానే తోపు అనుకున్న హారికకు చుక్కలుచూపించాడు నాగ్. ఒక్కో వీడియో చూపిస్తూ.. హారిక తప్పులన్నీ బయటపెట్టాడు. మొనాల్, అభిజిత్ మధ్య జరిగిన ఓ సంభాషణ విషయంలో హారికకు క్లాస్ పీకాడు నాగార్జున.


అభిజిత్ హౌస్ రూల్స్ బ్రేక్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడినా.. కెప్టెన్ గా ఉన్న నువ్వు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించాడు. అభిజిత్ మొనాల్ ను ఏడిపించినా పట్టించుకోలేదని సీరియస్ అయ్యాడు నాగ్. అయితే మొనాల్ ను అభిజిత్ ఏడిపించలేదని కవరింగ్ చేసేందుకు హారిక ట్రై చేసింది. కానీ మొనాల్ ను తాను ఏడిపించానని అభిజిత్ చెప్పే మరో వీడియో ప్లే చేయడంతో హారిక పని అయిపోయింది.

కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరిని సమానంగా చూడాలి. ఎవరిపైనా పర్సనల్ ఎఫెక్షన్ చూపించకూడదు. కానీ ఆ రూల్స్ బ్రేక్ చేసి.. అభికి ఫేవర్ గా ఉన్నావని హారికకు క్లాస్ పీకాడు నాగ్. కెప్టెన్ అయ్యేందుకు సహకరించిన మొనాల్ కు వ్యతిరేకంగా పనిచేశావన్నాడు.


ఇలా వరుసపెట్టి ఒక్కో వీడియో చూపిస్తూ... హారిక తప్పులన్నీ బయటపెట్టాడు నాగ్. ఇన్ని తప్పులు చేసిన నువ్వు బెస్ట్ కెప్టెన్ కానే కాదంటూ తేల్చి చెప్పాడు. దీంతో హారిక కన్నీరు పెట్టుంది.

- రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ సునీత.. వరుడు ఎవరంటే?

- టీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్, కేసీఆర్ ఓ పిట్టల దొర.. బండి సంజయ్ ఫైర్!

- ఈ హాట్ బ్యూటీ గుర్తుందా..?

Next Story
Share it