Top
Batukamma

ఏం.. రాజమౌళి తిక్కతిక్కగా ఉందా?

ఏం.. రాజమౌళి తిక్కతిక్కగా ఉందా?
X
Highlights

Komaram Bheem Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం RRR.. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన ,మంచి అంచనాలు ఉన్నాయి.

Komaram Bheem Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం RRR.. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన ,మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తుండడం సినిమాకి మరో ప్లస్..

ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన అల్లూరి సీతారామరాజు ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అ తరవాత కొంచం గ్యాప్ ఇచ్చి దసరా కానుకగా ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు.

"వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చను పాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్.. " అంటూ రామ్ చరణ్ అందించిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ఇంత వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. టీజర్ చివర్లో ఎన్టీఆర్ (కొమరం భీమ్) ముస్లిమ్స్ ధరించే క్యాప్ ని పెట్టుకొని ఆ గెటప్ లో రావడం పట్ల సోషల్ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను రాజమౌళి వక్రీకరిస్తున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజాం నవాబులకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాటం చేశాడని, అందుకే కుట్ర చేసి ఆయనని చంపారని, అలాంటి కొమరం భీమ్ ని అలా ఎలా చూపిస్తారని రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఓ హిందువుని ముస్లిం లాగా చూపించిన రాజమౌళి.. అదే ముస్లింని హిందువుగా చూపించగలవా అని ప్రశ్నిస్తున్నారు. మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాలు చేయొద్దని, చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి.. అంతేకాని పాపులేషన్ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తే తెరలు చినిగిపోతయంటూ ఏకంగా రాజమౌళికి వార్నింగ్స్ ఇస్తున్నారు. సినిమాలో సదరు సన్నివేశాన్ని తీసివేయాలని కోరుతున్నారు.


source : Twitter



source : Twitter

అయితే దీనిపైన మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ అసలు అలా రాజమౌళి ఎందుకు చూపించాడో సినిమా చూస్తే కానీ తెలియదని అంటున్నారు. ఏమైనా కానీ సినిమా టీజర్ పైన ఇప్పుడే ఇంతా రాదంతం నెలకొంటే ఇక విడుదలయ్యకా ఇంకెలా ఉంటుందో చూడాలి.




Next Story
Share it