Top
Batukamma

నో డేటింగ్... నేనింకా సింగిలే ఇంటున్న ఇస్మార్ట్ బ్యూటీ..

నో డేటింగ్...  నేనింకా సింగిలే ఇంటున్న ఇస్మార్ట్ బ్యూటీ..
X
Highlights

వీళ్లతో డేటింగ్, వాళ్లతో లివ్ ఇన్ రిలేషన్ షిప్.. అని చాలా రకాలుగా వార్తలు వస్తుంటాయి.

సినీ స్టార్లు చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఒక్కొక్కర్లుగా తమ సింగిల్ స్టేటస్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. డార్లింగ్ బ్యూటీ కాజల్ కూడా సెటిల్ అయిపోయింది.

అయితే.. సినీ పరిశ్రమలో నటులు, మరీ ముఖ్యంగా హీరోయిన్లు సింగిల్ గా ఉండటం చాలా అరుదు. వీళ్లతో డేటింగ్, వాళ్లతో లివ్ ఇన్ రిలేషన్ షిప్.. అని చాలా రకాలుగా వార్తలు వస్తుంటాయి.

ఒకట్రెండు సినిమాలు బంపర్ హిట్ కొట్టిన బ్యూటీల విషయంలో ఇలాంటి గాసిప్స్ కు కొదువే ఉండదు. కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తుంటాయి. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

తెలుగులో ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోందంటూ చాలా కాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. వ్యవహారం చాలా దూరం వెళ్లిందని టాక్.

కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం అదేం లేదంటోంది. తాను సింగిల్ గానే ఉన్నానని.. తేల్చి చెప్పింది. మనసు నచ్చే వాడు దొరికే వరకు అది అలాగే ఉంటుందని చెబుతోంది.




















Next Story
Share it