Top
Batukamma

ఆనాటి మీనా త్యాగమే.. ఈనాటి రోజా సక్సెస్!

ఆనాటి మీనా త్యాగమే.. ఈనాటి రోజా సక్సెస్!
X
Highlights

ఒకరు వద్దునుకున్న పాత్ర మరొకరికి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుందో అందరికి తెలిసిందే. అలాంటివి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

ఒకరు వద్దునుకున్న పాత్ర మరొకరికి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుందో అందరికి తెలిసిందే. అలాంటివి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. హీరోయిన్ రోజా విషయానికి వస్తే.. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'ప్రేమ తపస్సు' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రోజా.. ఈ సినిమా తర్వాత ఛాన్సులు లేక ఖాళీగా ఉండిపోయింది.

అయితే అదే సమయంలో ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా 'సర్పయాగం' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శోభన్ బాబుకు కూతురుగా మీనాని అనుకున్నారు. అప్పటికే నిర్మాత రామానాయుడు ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. సినిమాలో అదే కీలకమైన పాత్ర కూడా.. కానీ ఆ పాత్ర సినిమా చివర్లో చనిపోతుంది.

అయితే అప్పటికే మీనా.. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాతో మంచి ఫామ్‌లో ఉంది. అయితే చివర్లో చనిపోయే కూతురు పాత్రను మీనా చేస్తే ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోరనే ఉద్దేశ్యంతో పరుచూరి బ్రదర్స్ కొత్తవాళ్ళని తీసుకుందామని రామానాయుడుతో అన్నారట.. దీంతో నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్.. తానూ డైరెక్ట్ చేసిన ప్రేమ తపస్సు సినిమాని చూడమని సలహా ఇచ్చారట..

ఆ సినిమాని చూసిన పరుచూరి బ్రదర్స్ రోజా నటనకి ఫిదా అయిపోయి మీనాను అనుకున్న పాత్రను రోజాతో చేయించాలని అనుకున్నారట.. దీంతో మీనా ఆ పాత్రను త్యాగంచేయడం, ఆ పాత్రను రోజా చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం, రోజాకి మంచి పేరు రావడం చకచక జరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపొయింది రోజా. ఈ విషయాలను పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానెల్‌లో వెల్లడించారు.



Next Story
Share it