Top
Batukamma

వకీల్ సాబ్ రివ్యూ : పవన్ కుమ్మేశాడు.. 200 కోట్లు పక్కా..!

pawankalyans vakeel saab movie review
X
Highlights

సినిమా టైటిల్స్ లోనే ఎవరికి ఎంత ప్రాధాన్యం అని అర్థమవుతుంది! హీరో తర్వాత హీరోయిన్ పేరు వేయటం తర్వాత ప్రధాన తారాగణం ఇది తరచూ జరిగేది ఇందులో భిన్నం

సినిమా టైటిల్స్ లోనే ఎవరికి ఎంత ప్రాధాన్యం అని అర్థమవుతుంది! హీరో తర్వాత హీరోయిన్ పేరు వేయటం తర్వాత ప్రధాన తారాగణం ఇది తరచూ జరిగేది ఇందులో భిన్నం! హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి తను విశేష అభిమానులు ఉన్న .. సారీ భక్తులు ఉన్న పవర్ స్టార్ కాబట్టి హీరోయిన్ ఉండాలి అని తెచ్చి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది శృతి హాసన్ పాత్ర!

శృతిహాసన్ అంటే పవన్ కు ఎంత ప్రేమో చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ అంత జబ్బు ఉన్న మహిళ కి ముందుగా టాబ్లెట్లు అయిపోకముందే తెచ్చి పెట్టాలి అనే చిన్న లాజిక్ మిస్ అయ్యారు! వకీల్ సాబ్ తాగుడుకు ఎందుకు అలవాటు పడ్డాడు అని చెప్పడానికి మాత్రమే అలా అనుకుంటా! సినిమాలో విమర్శించడానికి అవకాశం ఉన్నది ఈ ఒక్క అంశం మాత్రమే!

అశకు భయానికి మధ్య నలిగిపోయే ముగ్గురు మధ్యతరగతి యువతులు అనుకోకుండా ఒక వివాదంలో ఇరుక్కుని ఇబ్బందులు పడతారు! సర్దుకుపోదామంటే ఆత్మాభిమానం ఎదిరిద్దాం అంటే సమాజం నిందలు! అలా సమాజం విధించిన కట్టుబాట్లతో నలిగిపోతున్న యువతులకు .. ఏ సామాన్య జనానికి అండగా ఉండి పోరాడతాడో వారి భయంతోనే ఓడిపోయి బహిష్కరణకు గురైన వకీల్ సాబ్ అండగా నిలబడతాడు! ఇదీ ప్రమార్థం!

కేసు గెలవాలనే న్యాయవాది నంద - న్యాయం గెలవాలి అనే వకీల్ సాబ్ సత్యదేవ్ ఈ ఇద్దరి మధ్యలో ముగ్గురు యువతులు! ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది కానీ గెలిచిందంతా న్యాయం కాదు అనే శ్రీశ్రీ మాట ప్రస్తావనార్హం! వాదప్రతివాదనలు ముఖ్యం! తీర్పులు ఎలా మారుతాయి అనే మాటకి కూడా సమాధానం లభిస్తుంది! కోర్టులో వాదించటం మధ్యమధ్యలో కోటు తీసి వాయించటం ఇదే ద్వితీయార్ధం!

ద్వితీయార్ధంలో మొత్తం న్యాయస్థానం లో తీయటం అంటే సాహసమే అయితే ఎక్కడా అలా అనిపించకుండా ఆకట్టుకునే డైలాగులతో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధంతో సాగిపోతూ ఆకట్టుకుంటుంది ఫ్యాన్స్ కి జోష్ తెప్పిస్తుంది!

ముగ్గురు మహిళలు అనగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం లో వచ్చిన చెడ్డ పేరు ప్రస్తావనకు రావటం సహజం! ఈ సినిమాలో ముగ్గురు యువతులకు అండగా నిలబడి వారి వాస్తవ పరిస్థితిని ఆవేదనను న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వినిపించే విధం సింప్లీ సూపర్బ్! చీడ పురుగు పట్టిన మగవారికి మందు వేయకుండా మహిళలకు మందు వేయాలి అనుకునే ఆలోచన అర్ధరహితం అంటూ పల్లవి ఆ పని చేయకపోతే ఒక నిర్భయ ఒక దిశ అయ్యేది ఆ తర్వాత క్యాండిల్స్ పట్టుకోవటం పోస్టులు పెట్టుకోవటం ఒక వారం తరువాత మర్చిపోవడం ఇదీ జరిగేది ఇది కాదు కావాల్సింది అంటూ వకీల్ సాబ్ వాదనతో కన్విన్స్ చేయటం చెప్పే విధానం మహిళలనే కాదు మనసున్న మగవారిని కూడా ఆలోచింపచేస్తుంది!

"వకీల్ సాబ్" ముగ్గురు యువతుల కేసు గెలుస్తాడు న్యాయాన్ని గెలిపిస్తాడు మహిళల & మనసున్న మనుషుల మనసు గెలుస్తాడు అభిమానులను మెప్పిస్తాడు ప్రేక్షకులను అలరిస్తాడు కలెక్షన్లూ కొల్లగొడతాడు!

Credit : Ppn Prasad

Next Story
Share it