Vakeelsaab Review: వకీల్ సాబ్ సినిమాకి అదొక్కటే మైనస్..!

పవన్ కళ్యాణ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అంటున్నారు. స్క్రీన్ పైన పవన్ ఆపియరెన్స్ కెవ్వు కేక అంటున్నారు.
మూడేళ్ళ తరవాత వకీల్ సాబ్ అంటూ ఓ పవర్ఫుల్ కథతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాపైన అంచనాలను ఒక్కసారిగా పెంచేసిన పవన్.. ఈ రోజు థియేటర్ లోకి అడుగుపెట్టాడు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే దుబాయ్ లాంటి దేశాలలో సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలను ఇస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే .. పవన్ కళ్యాణ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అంటున్నారు. స్క్రీన్ పైన పవన్ ఆపియరెన్స్ కెవ్వు కేక అంటున్నారు. లాయర్ పాత్రలో పవన్ ఒదిగిన తీరు సింప్లీ సూపర్బ్ అంటున్నారు.
పవన్, ప్రకాష్ రాజ్ మధ్య కోర్టులో వచ్చే సన్నివేశాలు థియేటర్లో విజిల్స్ వేయిస్తామని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సినిమా కోసం టైం కేటాయించి మరి చూడాలని అంటున్నారు.
ఇక ఫ్యాన్స్ కి అయితే పునకాలేనని..అంచనాలకి. మించి సినిమా ఉందని చెప్తున్నారు. వేణు శ్రీరామ్ పవన్ చూపించిన విధానం చాలా బాగుందని, కానీ ఫస్ట్ హాఫ్ కొంచం స్లో అయిందని చెప్తున్నారు.ఇదే సినిమాకి మైనస్ అంటున్నారు.
మొత్తంగా సినిమా రచ్చ రచ్చేనని... ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ సినిమా అంటున్నారు. థమన్ మ్యూజిక్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని పెంచాయని, రికార్డు స్థాయిలో బాక్స్ ఆఫీస్ లెక్కలు ఉంటాయని చెప్తున్నారు.