Top
Batukamma

బాలయ్యకి చెమటలు పట్టించేందుకు హీరోయిన్ రెడీ!

బాలయ్యకి చెమటలు పట్టించేందుకు హీరోయిన్ రెడీ!
X
Highlights

నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. 'సింహా', 'లెజెండ్‌' సినిమాల తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడం విశేషం..

నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. 'సింహా', 'లెజెండ్‌' సినిమాల తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడం విశేషం.. దాదాపుగా 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా కరోనా వలన వాయిదా పడింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ వారే అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది పేర్లు వినిపించాయి.. కానీ ఇప్పుడు ఆ లిస్టులో మరో ఇండస్ట్రీ నుంచి మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆమె మలయాళీ భామ ప్రయాగ మార్టిన్‌.


ప్రయాగ మార్టిన్‌ మలయాళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సినిమాలు చేస్తోంది. తెలుగులో ఎప్పుడు సినిమాలు చేయకపోవడంతో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే ఆడియన్స్ కి ఫ్రెష్ లుక్ గా అనిపిస్తుందని బోయపాటి ఫిక్స్ అయ్యరట!

ఇప్పటికే ఆమెకి కథ, పాత్రని చెప్పగా ఆమె కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. జరగబోయే తర్వాతి షెడ్యుల్ లో బాలయ్య, ప్రయాగ మార్టిన్‌ మధ్య సన్నివేశాలను బోయపాటి తెరకెక్కించనున్నాడు.


ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ డబల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే బాలయ్య బర్త్ డేకి రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.







Next Story
Share it