Top
Batukamma

వంటలక్క ప్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే వార్త

వంటలక్క ప్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే వార్త
X
Highlights

సింగిల్ సీరియల్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న వంటలక్క ఇప్పుడు మరో కొత్త రోల్ లో కనిపించబోతోంది.

మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్ కు ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కూడా లేకపోవడం విశేషం.. ఈ సీరియల్ తర్వాత ఎన్ని సీరియల్స్ వచ్చినప్పటికీ ఈ సీరియల్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి.

స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికీ టిఆర్పి రేటింగ్ లో మాత్రం కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. అంతెందుకు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరుపొందిన బిగ్ బాస్ కూడా టీఆర్పీ విషయంలో ఈ సీరియల్ తో పోటీ పడలేకపోతుందంటే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..

అంతేకాదు.. ఈ సీరియల్ టైమింగ్ కి ఐపీఎల్ టైమింగ్స్ కి మధ్య క్లాష్ వస్తుందని ఐపీఎల్ టైమింగ్ మార్చాలని ఓ అభిమాని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ట్వీట్ కూడా చేశాడు.

ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న ప్రేమి విశ్వనాధ్ (premi vishwanath) కి బయట హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటనకు మామూలు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. కేవలం సింగిల్ హ్యాండ్ తోనే సీరియల్ ని టాప్ లో నడిపిస్తుంది ఆమె.. ఇక ఇదిలా ఉంటే ఈ వంటలక్కకి ఏకంగా మెయిన్ లీడ్ లో సినిమా ఛాన్స్ వచ్చింది.

ఈ విషయాన్ని ఆమె (premi vishwanath)స్వయంగా వెల్లడించింది . త్వరలోనే ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట.. దీనితో వంటలక్క ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

Next Story
Share it