Top
Batukamma

Dil Raju కీలక నిర్ణయం... ఖుషిలో రెండో భార్య!

Dil Raju కీలక నిర్ణయం... ఖుషిలో రెండో భార్య!
X
Highlights

ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు.. ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటాయి.

ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు.. ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటాయి. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా, సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న దిల్ రాజు గతేడాది లాక్ డౌన్ సమయంలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..

కరోనా మూలంగా పెళ్లికి అందరిని పిలవలేకపోయినా తన యాభై పుట్టినరోజు వేడుకలకు అందర్నీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు దిల్ రాజు.. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ తో పాటుగా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే దిల్ రాజు ఏ సినిమా తెరకెక్కించిన తన మొదటి భార్య శ్రీమతి అనిత సమర్పించు అని టైటిల్ కార్డ్స్‌లో వేస్తూ వస్తున్నాడు.

అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు శ్రీమతి అనిత లేదా తన పేరున దిల్ రాజు సమర్పించు అని టైటిల్స్ లో వేసుకునే దిల్ రాజు ఇక నుంచి తన రెండో భార్య తేజస్విని పేరు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.. అంటే ఇక నుండి సినిమాకి ముందు శ్రీమతి అనిత మరియు శ్రీమతి తేజస్విని సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అని వచ్చేలా కీలక మార్పులు చేసినట్టు సమాచారం.

దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన రెండో భార్య తేజస్విని ఫుల్ ఖుషీలో ఉందట.. రెండో భార్యను ఖుషీ చేయడానికి దిల్ రాజు పెద్ద ప్లానే వేసాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

Next Story
Share it