Top
Batukamma

హైపర్ ఆది.. నీ బొక్కలో స్కిట్స్ ఆపు.. చూడలేక చస్తున్నాం..!

హైపర్ ఆది.. నీ బొక్కలో స్కిట్స్ ఆపు.. చూడలేక చస్తున్నాం..!
X
Highlights

నిన్ను ఆలా ఎవడైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తే తెలుస్తుంది... ఎదవ పంచులు నువ్వు

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.. టైటిల్ గా తగ్గట్టుగానే మొదట్లో కామెడీ ఖతర్నాక్ గానే ఉండేది. కానీ ఆ తర్వాత కంపుగా మారిపోయింది. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ లు అయితే దారుణం... అసలు స్కిట్ లో కామెడీ చేస్తున్నాడో, పక్కోడి లైఫ్ ని స్కిట్ లో పెడుతున్నాడో అర్ధం కావడం లేదు..

జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం తరవాత అంత క్లిక్ అయింది అంటే ఆదినే అని చెప్పాలి. పంచ్ పంచ్ కి నవ్వుకునే గ్యాప్ కూడా ఇవ్వడు. ఇక యూట్యూబ్ లో అయితే మనోడి వీడియోలకి యమ క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు హైపర్ ఆది స్కిట్ అంటేనే చిరాకు లేస్తోంది.

కామెడీ అంటే చాలా రకాలుగా చేయొచ్చు.. కానీ ఎంతసేపు ఆ దొరబాబు, రైజింగ్ రాజుల పైన అవే పంచులు.. అవే ప్రాసలా? చేసే ఆదికి బోర్ కొట్టడం లేదేమో కానీ చూసే జనాలకు మాత్రం విసుగు వస్తోంది. నవ్వించడం అనేది ఓ ఆర్ట్.. అది అందరికి రాదు. కానీ ఆ నవ్వించడం అనేది ఓ పద్ధతిగా ఉండాలి. పక్కోడిని హేళన చేసి కాదు.

దొరబాబు, రైజింగ్ రాజుల ఇంకో ఇద్దరు ముగ్గురు పైన అవే పంచులా.. నీకు కొత్తగా స్కిట్ చేయడం రాదా? దొరబాబు, రైజింగ్ రాజులు లేకపోతే జబర్దస్త్ లో నీపని గోవిందేనని జనాలు అనుకుంటున్నారు. ఇక గతవారం హైపర్ ఆది చెసిన స్కిట్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.

"ఆది నువ్వు అందరిని కించపరుస్తావా అంత కన్నా చెయ్యలేవా.. ఎవరినో ఎదో అంటూ చెయ్యడం కాదు.. నవ్వించడానికి వేరే మార్గాలు చాలా ఉంటాయి ఎందుకు ఈ మార్గం ఎంచుకున్నావ్.. మొదటిలో బాగా చేసేవాడివి మళ్ళీ ఓవర్ పంచెస్ బాగాలేదు " అంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు.

"ఆది నువ్వు చేస్తుంది తప్పు .. నువ్వు ఎదగడం కోసం వాళ్ళని తొక్కేస్తున్నావ్.. నీ పద్దతి మార్చుకో .. ప్రతి ఏపిసోడ్ లో అదే పని చేస్తున్నావ్ నిన్ను ఆలా ఎవడైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తే తెలుస్తుంది... ఎదవ పంచులు నువ్వు"అని మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు.

ఆ పంచులు మానుకో ఆది.. అప్పుడే నువ్వు ఎదుగుతావు.. నువ్వు రాజు పైన 2పంచులు దోర బాబు మీద 2పంచులు అదే నీ స్కిట్ .. వేరే పంచులు కొత్తగా మార్చు... చూడలేక చేస్తున్నాం.. నువ్వు నవ్వడం ఆపు పంచ్ అయిపోగానే.." అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మరో ఫ్యాన్. వీడి స్కిట్ లో ఎవరిని పైకిరానివ్వడు. వాడికి మాత్రమే పంచులు రాసుకుంటాడు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.



Next Story
Share it