Top
Batukamma

హేమ కూతుర్ని లైన్లో పెట్టిన పూరి కొడుకు!

హేమ కూతుర్ని లైన్లో పెట్టిన పూరి కొడుకు!
X
Highlights

ఇప్పుడే హీరోగా సెటిల్ అవుతున్నా ఆకాష్ పూరి పై సోషల్ మీడియాలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే సీనియర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ హేమ కూతురు ఇషాతో లవ్ లో ఉన్నాడని..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాష్ అందరికీ సుపరిచితుడే. ప్రస్తుతం హీరోగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆకాష్. ఆ మధ్య పూరి డైరెక్షన్ లో వచ్చిన మెహబూబా సినిమాలో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రొమాంటిక్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పుడే హీరోగా సెటిల్ అవుతున్నా ఆకాష్ పూరి పై సోషల్ మీడియాలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే సీనియర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ హేమ కూతురు ఇషాతో లవ్ లో ఉన్నాడని.. ఇద్దరి లవ్ కి ఇంట్లో కూడా ఒప్పుకున్నారని, త్వరలోనే పెళ్లి అంటూ న్యూస్ స్ప్రెడ్ కొడుతుంది.


అయితే ఈ న్యూస్ పైన తాజాగా నటి హేమ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని, ఇప్పట్లో తన కూతురికి పెళ్లి చేసే ఆలోచన లేదని వెల్లడించింది. అంతేకాకుండా ఒకవేళ తన కూతురు ఎవరినైనా ప్రేమిస్తే తప్పకుండా అతనితోనే పెళ్లి చేస్తానని చెప్పుకొచ్చింది. పిల్లల ఇష్టాలకంటే ఎది ఎక్కువ కాదని అంటుంది.

దీనితో ఈ రూమర్స్ కి చెక్ పెట్టినట్టు అయింది. ఇక ఇదిలా ఉంటే.. దర్శకుడు పూరి జగన్నాద్ కి నటి హేమ కి మంచి సాన్నిహిత్యం ఉంది. పూరి పెళ్లి సమయంలో కూడా హేమ సహాయం చేసింది. సో అప్పటినుంచి హేమ, పూరి జగన్నాథ్ నీ అన్నయ్య అని పిలుస్తుంది. అలా ఇషా, ఆకాష్ ల మధ్య మంచి సానిహిత్యం ఉంది.




Next Story
Share it