Top
Batukamma

అప్పుడు తాగుడుకి బానిసైంది.. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అంటుంది!

అప్పుడు తాగుడుకి బానిసైంది.. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అంటుంది!
X
Highlights

Rachna Banerjee : దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది బెంగాలీ నటి రచనా బెనర్జీ..

Rachna Banerjee : దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది బెంగాలీ నటి రచనా బెనర్జీ.. ఆ తరవాత జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన బావగారు బాగున్నారా అనే సినిమాలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత కన్యాదానం, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, పిల్ల నచ్చింది, పెద్ద మనుషులు, నీతోనే ఉంటాను, లాహిరి లాహిరి లాహిరిలో, అభిషేకం మొదలగు సినిమాలో నటించింది.

అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రచన ఒక్కసారిగా సైడ్ అయిపోవడం అందరికి షాక్ కి గురి చేసింది. అయితే ఆమె సినిమాలకు దూరం కావడం చెడు అలవాట్లేనట.. రచన మద్యం, సిగరెట్లకు బానిస అవ్వడంతో అవకాశాలు తగ్గి డిప్రెషన్‌కు గురైందట.. ఆమెను అలా చూడలేక ఆమె కుటుంబ సభ్యులకి నచ్చలేకా బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తితో పెళ్లి చేసారు.

ఆ తర్వాత రచన వైవాహిక జీవితంలో పడి చెడు అలవాట్లకు దూరం అయిందట.. ఇతర భాషల్లో అవకాశాలు సంపాదించుకొని చెడు అలవాట్లకు పూర్తిగా దూరమైంది రచన.. ప్రస్తుతం సినిమాలతో, షోలతో బిజీ అయిపొయింది రచన.. ఇక తెలుగులో రీఎంట్రీకి సిద్దమైందట.

మంచి పాత్రలు ఇస్తే తెలుగులో మళ్లీ నటించేందుకు తాను రెడీ అని రచన చెబుతోంది. ఇప్పటివరకు రచన కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కలిసి 200 సినిమాలలో నటించింది.

Next Story
Share it