Top
Batukamma

అనే నేను.. ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ ప్రమాణస్వీకారం..!

అనే నేను.. ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ ప్రమాణస్వీకారం..!
X
Highlights

సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ మెసేజ్ ఇవ్వడంలో ఆయనకి ఆయనే సాటి... ఇండియన్ 2 ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అనుకున్నారు..

దేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు.. సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ మెసేజ్ ఇవ్వడంలో ఆయనకి ఆయనే సాటి... ఇండియన్ 2 ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అనుకున్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. మళ్ళీ పట్టాలేక్కడం కూడా డౌటే..

ఈసమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాని అనౌన్సు చేశాడు శంకర్.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అదేంటి అంటే ..ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడట.. అంటే సినిమా నేపధ్యం పూర్తి రాజకీయం అన్నమాట.. గతంలో శంకర్ ఇదే నేపధ్యంలో ముదల్‌వన్ అనే సినిమాని తెరకెక్కించారు. దీనినే తెలుగులో ఒకే ఒక్కడుగా రిలీజ్ చేశారు.

ఇందులో అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అదరగొట్టారు. సినిమా కూడా బాగా హిట్టైంది. ఇప్పుడు ఇదే నేపధ్యంలో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చరణ్ పాత్రకి శంకర్ ఏ పేరు పెడతాడన్నది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కానుంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలేక్కనుంది.

Next Story
Share it