Top
Batukamma

Ram gopal varma:నేను నీకు సేవ చేస్తా.. మరో యాంకర్ ని పడేసిన ఆర్జీవి..!

Ram gopal varma:నేను నీకు సేవ చేస్తా.. మరో యాంకర్ ని పడేసిన ఆర్జీవి..!
X
Highlights

యాంకర్ అమ్మాయి అయితే తెగ బోల్డ్ గా మాట్లాడేస్తుంటాడు వర్మ. ఎక్కువ అమ్మాయిలకే ఛాన్స్ ఇస్తారు.

Ram gopal varma: రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసిన ఓ సంచనలనమే.. ఎవరికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంటాడు. మనసులో ఏదీ ఉంటే అదే చెప్పేస్తాడు. ఇక యాంకర్ అమ్మాయి అయితే తెగ బోల్డ్ గా మాట్లాడేస్తుంటాడు వర్మ(rgv). అందుకే వర్మ ఇంటర్వ్యూ అంటే ఛానల్స్ వాళ్ళు కూడా ఎక్కువ అమ్మాయిలకే ఛాన్స్ ఇస్తారు. అది వర్మ వీక్నెస్ మరి.!

ఇప్పటికి వర్మని ఇంటర్వ్యూ చేసి చాలా మంది లేడి యాంకర్స్ పాపులర్ అయ్యారు. అందులో ఒకరు ఇప్పుడు బిగ్ బాస్ లో(biggbosstelugu) ఉన్న అరియనా గ్లోరి(ariyana glory).. "నిన్ను బికినీలో చూడాలని ఉంది. సినిమా తీస్తా వస్తావా?" అని ఇంటర్వ్యూలో డైరెక్ట్‌ గా అడిగేసి ఆమెకి బిగ్ బాస్ లోకి ఛాన్స్ వచ్చేలా చేశాడు వర్మ. ఈ ఒక్క ఇంటర్వ్యూ తో చాలా పాపులర్ అయింది అరియనా గ్లోరి.

ఇలా చాలా మంది అమ్మాయిలకు బోల్డ్ గా ఆన్సర్స్ ఇస్తూ ఆఫర్స్ ఇస్తా అంటూ బౌల్డ్ చేస్తున్నాడు వర్మ.. తాజాగా మరో యాంకర్ అందానికి ఫిదా అయిపోయాడు వర్మ. తాజాగా వర్మ తెరకెక్కించిన 'కరోనా'(corona) సినిమా రిలీజ్ కి దగ్గరపడుతున్న నేపథ్యంలో పలు యూట్యూబ్ ఛానెల్స్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్నాడు వర్మ. అందులో భాగంగానే 'ఫ్రైడే పోస్టర్'(fridayposter) అనే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ.

ఈ ఇంటర్వ్యూలో మాత్రం ఈ కొత్త వర్మని ప్రేక్షకులు చూడొచ్చు అనే చెప్పాలి. వర్మ అంటే కాంట్రవర్శీనా.. లేదంటే వర్మ కాంట్రవర్శీ చేస్తారా? అని సదరు యాంకర్ ప్రశ్న వేయగా, ఆర్జీవీని కాంట్రవర్శీ చేసింది మీడియా వాళ్లే. వాళ్లు చేసేట్టు నేను చేస్తా' అంటూ వర్మ తన స్టైల్ లో సమాధానం చెప్పాడు. మీరు ఇంతలా ఆన్సర్‌లు చెప్తే కాంట్రవర్శీ అవుతారు కదా వర్మ గారు అంటూ యాంకర్ వర్మతో చాలా ఫ్రీగా మూవ్ అయ్యింది.

ఎలా ఉన్నారు అంటే చాలా బోరింగ్ ప్రశ్నగా ఫీల్ అయ్యే వర్మ ఏకంగా యాంకర్ ని ఎలా ఉన్నారని ఆడిగేశాడు. మీరు అలా అడగడం నేనెప్పుడూ వినలేదు.నేను షాక్ అయ్యా అని యాంకర్ తెగ సిగ్గుపడింది. వర్మ కూడా షాక్ అవుతూ.. "అవును మీ అందం నా కళ్లను చెదరగొట్టింది.

నిన్ను చూడగానే నా మతి దొబ్బింది.. అందుకే నిన్ను ఆ క్వశ్చన్ వేశాను.. దయచేసి క్షమించేయండి" అంటూ కవర్ చేసుకొచ్చాడు వర్మ. ఇక యాంకర్ కూడా క్షమించాను అంటూ మరింత ఫ్రీ అయింది.

ఇక ఎప్పుడు నార్మల్ గా ఉండే వర్మ చాలా డిఫరెంట్ గా తయారయ్యారేంటి అని యాంకర్ అడిగితే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా వచ్చాను' అంటూ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు వర్మ. అయితే ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కదా అందుకే ఇలా రెడీ అయ్యానంటూ కామెంట్ చేశాడు వర్మ.


'నేను రమ్మని అడగడం లేదు కదా.. నేను సేవ చేస్తా అని చెప్తున్నా.. నాకు సేవ చేయమని అడగడం లేదు' అంటూ యాంకర్ ని పడేసే ప్రయత్నం చేశాడు వర్మ.

ఇక వర్మ లాగే ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు కూడా యాంకర్ కి పడిపోయారు. ఎం ఉందిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాంకర్ మరో అరియనా అవ్వడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఇంతలా పాపులర్ అయిన ఈ యాంకర్ పేరు లాస్య(lasya).

- Gold Rates:బంగారం ధరలు మళ్లీ ఢమాల్..

- Daily horoscope telugu : 10-12-2020 గురువారం నేటి రాశిఫలాలు

- నటి ఊహ మేనమామ కూడా సినీ నటుడే.. ఎవరో తెలుసా?

- మీ మనుగడ కష్టమైనప్పుడే ఉద్యమాలు గుర్తుకొస్తయా..?

Next Story
Share it