Top
Batukamma

Rajamouli ఇంకెన్ని రోజులు ఈ ఎత్తుకోచ్చుడు!

Rajamouli ఇంకెన్ని రోజులు ఈ ఎత్తుకోచ్చుడు!
X
Highlights

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోగా త్రిబుల్ ఆర్ అనే ఓ సినిమాని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ రాజమౌళి కి మంచి పేరుంది. దర్శకధీరుడుగా ఆయనను అభివర్ణిస్తారు ప్రేక్షకులు. బాహుబలి చిత్రం తీసిన తర్వాత రాజమౌళి పేరు ప్రపంచ దేశాలకు చేరుకొంది. ఇప్పుడు రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో మామూలు క్రేజ్ ఉండడం లేదు.

అయితే ఈ దర్శకుడిని కాపీ క్యాట్ అనే ట్యాగ్ వెంటాడుతుంది. తాజాగా మరోసారి తన కాపీ ట్యాగ్ ను బయటపెట్టుకున్నాడయన. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోగా త్రిబుల్ ఆర్ అనే ఓ సినిమాని చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. ఇందులో రామ్ చరణ్ గుర్రంపై.. ఎన్టీఆర్ బైక్‌పై కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు.


ఎన్టీఆర్ , రామ్ చరణ్ అభిమానులకి ఈ పోస్టర్ పిచ్చపిచ్చగా నచ్చేసింది. కానీ కాసేపటికి ఇది ఎత్తుకొచ్చిన పోస్టర్ అని తేల్చేశారు నెటిజన్లు!రాజమౌళి ఈ పోస్టర్ ను ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైపోయింది.

2007లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఘోస్ట్ రైడర్ సినిమా పోస్టర్ ఆధారంగా రాజమౌళి ఈ పోస్టర్ ను డిజైన్ చేశాడని అంటున్నారు.అయితే దీనిని కాపీ అని కొందరంటే.. మరికొందరు మాత్రం ఇది ఇన్‌స్పైర్ అని అంటున్నారు.


అయితే రాజమౌళికి ఇలాంటివి కొత్తేమీ కాదు...రాజమౌళి ఏ సినిమా చేసిన సరే ఆ సినిమా ఫస్ట్ లుక్ ఎక్కడో ఒక చోట మాత్రం ఉంటూనే ఉంటుంది. దీనితో ఇంకెన్ని రోజులు ఈ ఎత్తుకొచ్చుడు రాజమౌళి. నీ క్రియేటివిటీ ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు!



Next Story
Share it