Top
Batukamma

RRR : కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్

Ramaraju For Bheem - Bheem Intro - RRR
X
Highlights

తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. RRR టీజర్ తో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. RRR మూవీ టీజర్ తో యూట్యూబ్ ను, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ టీజర్ ను ఈ నెల 22న విడుదల చేశారు. విడుదల కొద్ది సేపట్లోనే ఈ వీడియో దూసుకెళ్లింది.

ఇప్పటి వరకు (26 అక్టోబర్ 2020 ఉదయం) 2 కోట్ల 24 లక్షల సార్లు ప్రజలు యూట్యూబ్ లో ఈ వీడియోను చూశారు. అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ వచ్చిన వీడియో ఇదే అంటున్నారు.

అంతేకాదు.. లైకుల విషయంలోనూ ఎన్టీఆర్ జోరు చూపిస్తున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో 1 మిలియన్ కు పైగా లైకులు వచ్చాయి.

యూట్యూబ్ లోనూ ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. హిందీ టీజర్ కు 7.9 మిలియన్లు, తమిళంలో టీజర్ కు 2.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.



Next Story
Share it