Top
Batukamma

అక్కినేని వారి కోడలు.. మామను మించిపోయింది..!

అక్కినేని వారి కోడలు.. మామను మించిపోయింది..!
X
Highlights

ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్ బాస్ చూస్తున్నారని షో నిర్వాహకులు కూడా పిచ్చి పబ్లిసిటీ కూడా చేసుకున్నారు..

అంత పెద్దగా తెలియుని హౌస్‌మేట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది... నాగార్జున మళ్ళీ హోస్ట్ చేయడంతో అంచనాలు కూడా అంతకి మించి ఉన్నాయి.. అందుకే ప్రారంభ ఎపిసోడ్‌కి ఏకంగా 18.5 రేటింగ్ వచ్చింది.. ఈ రేటింగ్ చూసి అందరూ ఆహా ఓహో అన్నారు... ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్ బాస్ చూస్తున్నారని షో నిర్వాహకులు కూడా పిచ్చి పబ్లిసిటీ కూడా చేసుకున్నారు..

ఆ తరవాత పసలేని టాస్క్ లు.. ఓటింగ్ లలో తేడాలు రావడం, ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్ అంటూ బిల్డప్ లు ఇస్తూ..బాగా ఆడే కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేయడంతో షో పైన ప్రేక్షకుల్లో ఉన్న క్రెడిబిలిటీని కోల్పోయింది. ముఖ్యంగా బిగ్ బాస్ దత్త పుత్తిక మోనాల్ ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో తెలియక చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు..

దానికి తోడు ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఈ షోలో మోనాల్ డ్రెస్, హాగ్ , కిస్, అఖిల్, అభిజిత్ లతో రొమాంటిక్ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ.. బాబోయ్ బిగ్ బాస్ అంటేనే పారిపోయేలా చేశారు.. దీనితో షోకి వీక్లీ వీక్లీ రేటింగ్ తగ్గుకుంటూ వచ్చింది.. వీకెండ్ లో నాగార్జున వచ్చిన రేటింగ్ రాకపోవడం మరి దారుణం.. అంతేకాదు.. చిన్న చితక సీరియళ్ళ ముందు కూడా ఈ షో సత్తా చాటలేకపోయింది..

ఇక ఆ ఇంగ్లిష్,ఈ అరవ భాషలతో పిచ్చేక్కిపోతున్న జనాలకు వచ్చిరాని తెలుగు భాషతో మాట్లాడే సమంతను దసరాకి హోస్ట్ గా తీసుకువచ్చారు నిర్వాహకులు .. అ ఎపిసోడ్ చూసాకా నెటిజన్లు ఆమె పైన వీపరితంగా ట్రోల్స్ చేశారు.. ఈమె కంటే నాగార్జుననే బెస్ట్ అంటూ ట్రోల్స్ కూడా వదిలారు.. అయితే ఆ ఎపిసోడ్ కీ వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూసి కంగుతింటున్నారు జనాలు..

సమంత చేసిన ఈ ఎపిసోడ్ కి 11.4 రేటింగ్ వచ్చింది. సమంత రాకతో రేటింగ్ పెరగడంతో బిగ్ బాస్ నిర్వహకులు కూడా సంబరపడుతున్నారు.. అటు అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగ్ విదేశాలకు వెళ్ళడంతో సమంత ఆ ఎపిసోడ్ ని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే..

Next Story
Share it