Top
Batukamma

సినిమా టైటిల్ కోసం తన్నుకునే దాకా పోయిన ఎన్టీఆర్, కృష్ణ..!

సినిమా టైటిల్ కోసం తన్నుకునే దాకా పోయిన ఎన్టీఆర్, కృష్ణ..!
X
Highlights

సినిమా మొదలుపెట్టినప్పుడే దర్శక నిర్మాతలు తమ సినిమా కోసం రెండు మూడు టైటిల్స్ ని ఫిక్స్ చేసుకొని ఉంటారు.

ఒక సినిమాకి కథ స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పాలంటే టైటిల్ తోనే సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ కూడా వస్తుంది. సినిమా మొదలుపెట్టినప్పుడే దర్శక నిర్మాతలు తమ సినిమా కోసం రెండు మూడు టైటిల్స్ ని ఫిక్స్ చేసుకొని ఉంటారు. అయితే తెలుగులో కొన్ని టైటిల్స్ వివాదాస్పదం అయ్యాయి.

కళ్యాణ్ రామ్ కత్తి, మహేష్ బాబు ఖలేజా మొదలగు సినిమాల టైటిల్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. చివరికి హీరో పేరు ముందు పెట్టి అదే టైటిల్ తో సినిమాలను రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే ఓ టైటిల్ విషయంలో మాత్రం పెద్ద గొడవే జరిగింది. అది కూడా అప్పటి స్టార్ హీరోలు సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మద్య.

బాలకృష్ణ , విజయశాంతి హీరో హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1987 లో సామ్రాట్ అనే ఓ సినిమా మొదలైంది. ఇదే టైటిల్ తో రిలీజ్ పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి కూడా. ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వి.మధుసూధన్ రావు దర్శకత్వంలో "సామ్రాట్" అనే టైటిల్ తోనే సినిమా మొదలైంది.


ఈ క్రమంలో టైటిల్ నాదంటే.. నాదే అని పెద్ద రచ్చ చేశారు నిర్మాతలు. అటు ఎన్టీఆర్, కృష్ణ తమ తమ కుమారుల సినిమాలకి సపోర్ట్ గా నిలిచారు. ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో వేరేవాళ్లు ఎవరు కూడా ఇందులో కలగజేసుకోలేదు.



చిన్నగా మొదలైన ఈ ఇష్యూ.. ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. మీడియా వరకు వెళ్లింది. ఆఖరికి కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో ఇండస్ట్రీ పరువు పోతుందని భావించిన పరిశ్రమ పెద్దలు ఇందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరికి నచ్చ జెప్పి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు.

ఎన్టీఆర్ ను కన్వీన్స్ చేయడంతో.. బాలకృష్ణ సినిమా పేరు కాస్త మార్చారు. బాలకృష్ణ సినిమా ముందు.. సాహస అని కలిపి "సాహస సామ్రాట్" గా రిలీజ్ చేశారు. ఇక రమేష్ బాబు మూవీని "సామ్రాట్" గానే రిలీజ్ చేశారు. ఇందులో సాహస సామ్రాట్ ప్లాప్ కాగా, సామ్రాట్ సూపర్ హిట్ అయింది.

- జానపదం టూ ఐటమ్ బీట్స్... దుమ్మురేపుతున్న మంగ్లీ

- డిఫరెంట్ లుక్ లో యాంకర్ శ్రీముఖి..

- బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!

Next Story
Share it