Top
Batukamma

స్టేజీ పైన చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేసిన మ‌నో !

స్టేజీ పైన చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేసిన మ‌నో !
X

Singer Mano Get Emotional

Highlights

సింగర్ మనో ఎంత చలాకీగా ఉంటారో అందరికి తెలిసిందే... అయన స్టేజీ పైన ఎంతో ఎనర్జిటిక్ గా పాట పాడుతారు. అంతేకాకుండా ఆ పాటకి తగ్గట్టుగా అభినయం చేస్తూ అందరిలో జోష్ నింపుతారు.

సింగర్ మనో ఎంత చలాకీగా ఉంటారో అందరికి తెలిసిందే... అయన స్టేజీ పైన ఎంతో ఎనర్జిటిక్ గా పాట పాడుతారు. అంతేకాకుండా ఆ పాటకి తగ్గట్టుగా అభినయం చేస్తూ అందరిలో జోష్ నింపుతారు. మరి ఆలాంటి మనో అదే స్టేజీ పైన చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేసాడు. ఆయనని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.. అయన అంతా భాగోద్వేగానికి లోనవ్వడానికి కారణం ఏంటి ఆసలు..

విజయదశమి సందర్భంగా ఈటీవీ 'అక్కా ఎవరే అతగాడు?' అనే ఓ స్పెషల్ షో జరిగింది. ఈ షోలో మనో, ఉష కలిసి గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సూర్యుడే సెలవని' పాటను ఆలపించారు. ఈ పాట పాడుతున్న మధ్యలో మనో చాలా భాగోద్వేగానికి లోనయ్యారు. స్టేజ్‌పైనే కన్నీటిప‌ర్యంత మ‌య్యారు.

దీనితో సెట్ లో ఉన్నవాళ్ళు అందరూ కూడా భాగోద్వేగానికి లోనయ్యారు. మ‌నోను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తరవాత మనో మాట్లాడుతూ.. .'బాల సుబ్రహ్మణ్యం గారిని చూస్తూ పెరిగాను. అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన మన మధ్య లేరంటే నిజంగా తట్టుకోలేకపోతున్నాను' అని అన్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో కలిపి 40 వేలకుపైగా పాటలు పాడారు బాలు..

కేవలం గాయకుడి గానే కాకుండా సంగీత దర్శకుడు, నటుడుగా మెప్పించారు బాలు.. ఆయనలేని లోటు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. యావత్ భారతీయ సినిమాకే తీరని లోటు.. అయన లోటును ఎవరు భర్తీ చేయలేరు కూడా..


Next Story
Share it