Top
Batukamma

Singer sunitha engagement: సిక్రెట్ గా సింగర్ సునీత నిశ్చితార్థం .. త్వరలోనే పెళ్లి!

singer sunitha engagement
X
Highlights

సింగర్ సునీత రెండో పెళ్ళి చేసుకుంటున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వీపరీతంగా న్యూస్ వైరల్ అవుతోంది.

Singer sunitha engagement: టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్ళి చేసుకుంటున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వీపరీతంగా న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపైన సునీత స్పందించకపోవడంతో ఆ వార్తలకి మరింతగా బలం చేకూరింది.

అయితే ఈ రోజు ఉదయం సునీత నిశ్చితార్థం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి వార్తల్లో ప్రచారం అవుతున్న డిజిటల్ మీడియాలోని ఓ వ్యాపారవేత్తతోనే సునీత(Singer sunitha) నిశ్చితార్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.

అటు సునీతని రెండో వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహమేనని సమాచారం. మీడియా దృష్టికి రాకుండా ఇరు కుటుంబ సభ్యులు చాలా రహస్యంగా ఈ నిశ్చితార్థ వేడుకని(engagement) జరిపినట్టుగా సమాచారం.

https://twitter.com/SIFlicks/status/1335817972800110593

ఇక సునీత సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి సునీత అతి చిన్న వయసులోనే మంచి సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

సింగర్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే కిరణ్(kiran) అనే వ్యక్త్రిని ప్రేమించి 19 ఏళ్ల వయసుల్లో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే కిరణ్ నిజస్వరూపం బయటపడడంతో భర్తకి విడాకులు ఇచ్చి గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు సునీత.

ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇద్దరు కూడా మంచి సింగర్స్ కావడం విశేషం. అయితే ఇన్ని రోజులు రెండో వివాహం పైన మొఖం చాటేస్తూ వస్తున్న సునీత ఇలా ఎవరకి చెప్పకుండా సిక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోవడం ఆసక్తిని సంతరించుకుంది.


- Yoyo tv:యోయో యాంకర్ మాములుగా రెచ్చిపోలేదు బాబోయ్!

- ఈ ఎల్లో సారీలో ఉన్న మహిళ ఎవరో తెలుసా?

- సహజనటి అంటూనే అసహజ పోస్ట్.. మీకు సిగ్గుందా?

Next Story
Share it