Top
Batukamma

రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ సునీత.. వరుడు ఎవరంటే?

రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ సునీత.. వరుడు ఎవరంటే?
X
Highlights

19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్ళకు భర్త తీరుతో విసిగిపోయిన సునీత అతనికి విడాకులు ఇచ్చారు.

సింగర్ గా , టెలివిజన్ యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సునీత. సినీ రంగంలో ఆమె ప్రయాణం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగినప్పటికి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె చాలా కష్టాలను చూసారనే చెప్పాలి.

19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్ళకు భర్త తీరుతో విసిగిపోయిన సునీత అతనికి విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత తనని తన కుటుంబం చాలా బాగా అర్ధం చేసుకుందిని సునీత చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక రెండో పెళ్లి పైన చాలా సార్లు వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖండించారు సునీత. ప్రస్తుతం తనకి ఇలానే బాగుందని, రెండో పెళ్లి చేసుకోవాలని ఆనిపిస్తే మీడియాకి ముందు తానే చెప్తానని ఆ మధ్య స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది సునీత.

అయితే సునీత రెండో పెళ్లికి సిద్దమాయ్యారంటూ ఓ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఓ డిజిటల్ మీడియాకి చెందిన వ్యక్తితో సునీత రెండో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. సదరు వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనని తెలుస్తోంది. అయితే దీనిపైనే ఎలాంటి అధికార ప్రకటన లేదు. మరి దీనిపైన సునీత ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!

Next Story
Share it