Top
Batukamma

Singer Sunitha Marriage: అంగరంగ వైభవంగా సింగర్ సునీత రెండో పెళ్లి!

Singer Sunitha Marriage: అంగరంగ వైభవంగా సింగర్ సునీత రెండో పెళ్లి!
X
Highlights

అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికైంది.

Singer Sunitha Marriage: ప్రముఖ గాయనీ సునీత, రామ్ వీరపనానినిల రెండో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికైంది.

హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ తన భార్య శాలినితో కలిసి హాజరయ్యాడు.


ప్రస్తుతం సునీత రెండోపెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా సునీత ఇప్పటికే కిరణ్ అనే వ్యక్తిని 19 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి ఇద్దరు సంతానం..

అయితే సునీత, కిరణ్ ల మధ్య విభేదాలు రావడంతో చాలా కాలం క్రితమే డైవర్స్ తీసుకుని తన పిల్లలతో దూరంగా ఉంటుంది సునీత. ఇక ప్రముఖ బిజినెస్ మెన్ రామ్ వీరపనానిని పరిచయం కాస్తా పెళ్లికి దారి తీసింది.


సునీతకి సంబంధించిన సోషల్ మీడియా ప్రోఫైల్స్ అన్ని రామ్ వీరపనానిని సంస్థే చూసుకుంటుంది. అటు రామ్ కూడా తన మొదటి భార్య నుండి చాలా కాలం క్రితమే విడాకులు తీసుకోగా, రామ్‌కి పిల్లలు లేరు.

Next Story
Share it