Top
Batukamma

ఒకరు పొట్టి.. ఒకరు పొడుగు.. ఎక్కడైనా సెట్ అయ్యిందా..?

ఒకరు పొట్టి.. ఒకరు పొడుగు.. ఎక్కడైనా సెట్ అయ్యిందా..?
X
Highlights

ఇలాంటి ఇద్దరి మధ్య పెళ్లి అంటూ... ఓ షో ప్లాన్ చేయడం ఏంట్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాంకర్ లలో ప్రదీప్, శ్రీముఖి ఒకరు.. అయితే త్వరలో వీరు పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారు. వీరి వెడ్డింగ్ కార్డు కూడా సిద్దమైపోయింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఇది నిజంగా పెళ్లి అయితే కాదు లెండి! ప్రతి పండగకి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ చేస్తాయి కదా.. అందులో భాగంగానే జీ తెలుగు ఛానెల్ ప్రదీప్ కి శ్రీముఖి కి పెళ్లి అంటూ ఓ ప్రోమోను వదిలింది.

చిరంజీవి ప్రదీప్‌కి చిలసౌ శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది.. అంటూ శుభలేఖ కొట్టించి చిన్న వీడియో రిలీజ్ చేసింది ''ఈ లేఖలో ఏముందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి దసరా స్పెషల్ ఈవెంట్'' అంటూ పెద్ద హైప్ క్రియేట్ చేసింది.

గత కొద్ది రోజులుగా ప్రదీప్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే కదా.. అయితే దీనిని క్యాష్ చేసుకున్న జీ తెలుగు ఛానల్ ఓ ప్రోగ్రాం ప్లాన్ చేసింది... రిలీజ్ చేసిన ప్రోమోకి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక టోటల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి!

అయితే.. వీళ్ల పర్సనాలిటీలకు ఎక్కడా పొంతన కుదరదు. ప్రదీప్ కాస్త పొట్టిగా ఉంటాడు. శ్రీముఖి మంచి పర్సనాలిటీతో హైట్ గా ఉంటుంది. ఇలాంటి ఇద్దరి మధ్య పెళ్లి అంటూ... ఓ షో ప్లాన్ చేయడం ఏంట్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

Next Story
Share it