Srireddy on niharika marriage: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి..!

ప్పుడూ ఏదో కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది ఈ బోల్డ్ స్టార్.
Srireddy comments on niharika marriage: టాలీవుడ్ లేడీ రెబల్ శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పనిచెప్పింది. ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది ఈ బోల్డ్ స్టార్.
మరీ ముఖ్యంగా మెగాస్టార్(megastar) ఫ్యామిలీ గురించి ఏదైనా మీడియాలో హైలైట్ అవుతోందంటే శ్రీరెడ్డికి(srireddy) చిర్రెత్తుకొస్తుంది. ఇప్పుడు చిర్రొత్తుకొచ్చింది.
దీనికి కారణం నాగబాబు కూతురు నిహారిక పెళ్లి(niharika marriage). ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా.. నిహరికి మ్యారేజ్ అప్డేట్సే కనిపిస్తున్నాయి. దీంతో శ్రీరెడ్డికి ఫుల్లుగా కాలింది.

ఇంకేముంది.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వారికోసం తన నోటికి పనిచెప్పింది.
సమాజంలో ఇప్పుడు చాలా సమస్యలున్నాయి. కాస్త వాటిని పట్టించుకోండి. రైతులు(farmer protest) ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు కాస్త వారిని చూపించండి. మహిళల సమస్యల గురించి పట్టించుకోండి.
పనికి మాలిన ఇష్యూలు పెట్టుకుని ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు చేయకండి... అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
కొంచెం పనికొచ్చే పనులు చెయ్యండి రా బాబు 🙏🙏🤨 pic.twitter.com/pUMDaCvy0w
— Sri Reddy (@MsSriReddy) December 10, 2020
శ్రీరెడ్డి ఇంత రచ్చ చేశాక మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా.? వాళ్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఫస్ట్ నీది నువ్వు చక్కగా చూసుకో ఆ తర్వాత వేరేవాళ్లకు నీతులు చెప్పు అంటూ తమదైన స్లైట్లో ఆన్సరిస్తున్నారు.
- Horoscope Today : 11-12-2020 శుక్రవారం నేటి రాశిఫలాలు
- విశ్లేషణ: ఈ మగాడిదల బుద్ధి ఇంతేనా..? వాడూ మగాడూ.. వీడూ మగాడే..!