Top
Batukamma

MGR క్రూర రాజకీయాలకి బలైన కమెడియన్ సుధాకర్!

MGR క్రూర రాజకీయాలకి బలైన కమెడియన్ సుధాకర్!
X
Highlights

దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ హీరోగా నటించాడు. నటి రాధిక, సుధాకర్ ది హిట్ పెయిర్... మొత్తం పద్దెనిమిది సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు.

బేతా సుధాకర్.. తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడుగా బాగా సుపరిచితుడు. సుధాకర్ స్వస్థలం.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు.

సినిమాలు అంటే పిచ్చి కావడంతో మద్రాస్ రైలు ఎక్కేశాడు. అక్కడ హీరో చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలసి ఒకే గదిలో ఉండేవాడు. అప్పటికి సహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం సుధాకర్ జీవితాన్ని మలుపు తిప్పింది.

భారతీరాజా కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సుధాకర్ ను సిఫారసు చేయడం... అందులో సుధాకర్ నటించడం.. మొదటి సినిమానే విజయవంతం అవడం జరిగింది. దీనితో సుధాకర్ క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది.

దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ హీరోగా నటించాడు. నటి రాధిక, సుధాకర్ ది హిట్ పెయిర్... మొత్తం పద్దెనిమిది సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. తమిళ్ లో బిగ్ స్టార్ గా ఎదుగుతున్న సుధాకర్ ని రాజకీయాలు కిందకి తొక్కేశాయి.

అప్పటీ ముఖ్యమంత్రి MGR(ఎం.జి.రామచంద్రన్) సుధాకర్ ని పార్టీలోకి ఆహ్వానించారట. కానీ అయన ఆహ్వానాన్ని సుధాకర్ తిరస్కరించారట.. దీంతో సుధాకర్ కి సినిమా అవకాశాలు తగ్గయాని అంటారు.

అప్పట్లో MGR ఒంటిచేత్తో ఇండస్ట్రీని శాసించేవారని, దీనితో సుధాకర్ కి అవకాశాలు తగ్గాయని అంటారు. అక్కడ అవకాశాలు తగ్గడంతో సుధాకర్ తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చిందట.

తెలుగులో చాలా మంది హీరోలకి సపోర్ట్ గా పాత్రలు చేశాడు సుధాకర్.. ఊరికిచ్చిన మాట, భోగి మంటలు, శుభాకాంక్షలు, సూర్యవంశం, రాజా, మా అన్నయ్య, హిట్లర్ చిత్రాలకి గాను సుధాకర్ కి మంచి పేరు వచ్చింది.

జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో సుధాకర్ 2010 జూన్ 29న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. జూలై 4 2010 నుండి కోమాలో చేరినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఆ తర్వాత చికిత్స పొంది కోమా నుంచి బయటకు వచ్చిన సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సినిమాలు చేయకున్నా.. తన కుటుంబంతో కలిసి కాలాన్ని గడుపుతున్నాడు.



Next Story
Share it