Top
Batukamma

ఒరేయ్ ఆది.. అసలు నీది నోరేనా లేక బూతుల బోరా!

ఒరేయ్ ఆది..  అసలు నీది నోరేనా లేక బూతుల బోరా!
X
Highlights

సుడిగాలి సుధీర్.. బుల్లితెర పైన మనోడికి ఉన్న క్రేజ్ మామలుది కాదు. జబర్దస్త్, ఢీ షోలలో సుధీర్ చేసే పెర్ఫామెన్స్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు.

సుడిగాలి సుధీర్.. బుల్లితెర పైన మనోడికి ఉన్న క్రేజ్ మామలుది కాదు. జబర్దస్త్, ఢీ షోలలో సుధీర్ చేసే పెర్ఫామెన్స్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సుధీర్ టైమింగ్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కేవలం సుధీర్ కోసమే ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, ఇతర కామెడీ షోలు చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.

అయితే స్కిట్ లలో సుధీర్‌ని చాలావరకూ అమ్మాయిల పిచ్చోడిలానే చూపిస్తుంటారు. అయితే ఇది స్కిట్ లో భాగమే అయినప్పటికీ అతని వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంటున్నాయి. ఇక తన స్కిట్ల ద్వారా డబుల్ మీనింగ్ పంచ్‌లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హైపర్ ఆది సుధీర్‌పై వేసిన పంచులు దారుణమనే చెప్పాలి.

తాజాగా ఢీ 13 కింగ్ Vs క్వీన్ ప్రోమోలో సుధీర్ పైన బూతుల పంచాంగాన్ని ఓపెన్ చేశాడు. వచ్చే ఎపిసోడ్ లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాన్సెప్ట్‌చేయనున్నారు. అయితే ఎర్రటి బట్టల్లో పాత తరం హీరోల్లా డిఫరెంట్ గెటప్ తో వచ్చాడు సుధీర్. ఇక హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి సుధీర్ పైన బూతుల వర్షం కురిపించాడు.

'కాలేజ్‌లో లత, గీతా ఉన్నారు కదా.. కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా.. వాళ్లు మనతో పోటీ పడతారట' అని సుడిగాలి సుధీర్‌తో ఆది అంటే.. 'ఏంటి మనతో పోటీపడతారా? కాలేజ్‌లో అందరి ముందు?' అని సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు. కల్చరల్ యాక్టివిటీస్ అంటే సాంష్కృతిక కార్యక్రమాలు.. నువ్ సాయంత్రం చేసే కార్యక్రమాలు కావు'.. అంటూ పంచ్ వేశాడు ఆది.

అంతేకాకుండా 'అన్నా (సుధీర్) నేను చాలా పేదవాళ్లం.. రోజూ పొద్దున్నే పస్తులుంటాం.. కానీ రాత్రి అయితే మాత్రం అన్న ఎక్కడో తినొచ్చి మీరు కూడా తినేయండ్రా అంటాడు.. మరి మాకు అర్థం కాదు ఎక్కడ తింటాడో ఏంటో' అంటూ మరో పంచ్ వేశాడు. ఇదే దారుణం అంటే.. "మా అన్న ఎరుపే కాదు.. ఒక అరుపు.. ఒక పరుపు అంటూ వరుస పంచ్‌లు వేసి సుడిగాలి సుధీర్‌తో ఓ ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది.

ఇదంతా స్కిట్ లో భాగమే అయినప్పటికీ సుధీర్ అభిమానులు మాత్రం లైట్ తీసుకోలేకపోతున్నారు. హైపర్ ఆదిని కామెంట్స్ రూపంలో దుమ్ముదులిపారు. ఒరేయ్.. ఆది అసలు నీది నోరేనా లేక బూతుల బోరా అంటూ ఓ ఆట ఆడుకున్నారు.


Next Story
Share it