Top
Batukamma

సురేఖావాణి రెండో పెళ్లిపై.. కూతురు రియాక్షన్ ఇదే..!

సురేఖావాణి రెండో పెళ్లిపై.. కూతురు రియాక్షన్ ఇదే..!
X
Highlights

ఇప్పుడు ఆమె, ఆమె కూతురు మాత్రమే ఉంటున్నారు. కూతురితో ఆమెకున్న అనుబంధం వారి ఫొటోల్లోనే కనిపిస్తూ ఉంటుంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సురేఖావాణి. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హల్చల్ చేస్తూనే ఉంది. లెటెస్ట్ ఫొటో షూట్ లతో ఎట్రాక్ట్ చూస్తూ ఉంటుంది. కూతురితో కలిసి ఎప్పకప్పుడు కొత్త ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్లకు మించి ఆమెకు ఫాలోయింగ్ ఉంటుంది.

కొంత కాలంగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు పెడుతోంది. 2019లో ఆమె భర్త చనిపోయారు. ఇప్పుడు ఆమె, ఆమె కూతురు మాత్రమే ఉంటున్నారు. కూతురితో ఆమెకున్న అనుబంధం వారి ఫొటోల్లోనే కనిపిస్తూ ఉంటుంది.

తోడు లేకుండా ఉన్న ఆమె.. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కూతురి సలహాతో ఆమె సెకండ్ మ్యారేజీకి రెడీ అయ్యారని జోరుగా వార్తలొచ్చాయి. విపరీతంగా ట్రోలింగ్ కూడా నడిచింది.

దీనిపై ఇప్పటికే స్పందించిన సురేఖ వాణి వాటిని ఖండించారు. ఇప్పుడు ఆమె కూతురు సుప్రీత సోషల్ మీడియాలో స్పందించింది. ''ఉన్న న్యూస్‌ చెప్పండి. కొత్తగా క్రియేట్‌ చేయకండి. కనీసం మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు'' అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఫైర్ అయ్యింది.



Next Story
Share it