Top
Batukamma

తమన్నాకి 15 ఏళ్ళు.. ఎందుకంటే?

తమన్నాకి 15 ఏళ్ళు.. ఎందుకంటే?
X
Highlights

అందుకే తమన్నాను ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుచుకుంటారు. నిజానికి ఆమె మిల్క్ బ్యూటీనే. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా పాలముద్దలాంటి తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది.

జాబిలి వెన్నెల వెలుగులాంటి అందం ఆమె సొంతం. వెన్నెలను తీసుకొచ్చి ప్రాణం పోశారా అన్నట్టుగా ఉంటుంది తమన్నా అందం. ముట్టుకుంటే కందిపోయే పాలరాతి సౌందర్యం ఆమె సొంతం.


అందుకే తమన్నాను ముద్దుగా మిల్క్ బ్యూటీ అని పిలుచుకుంటారు. నిజానికి ఆమె మిల్క్ బ్యూటీనే. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా పాలముద్దలాంటి తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది.


పాలబుగ్గుల.. వెన్నెల ముద్దలాంటి ఈ అందం చిత్ర పరిశ్రమలోకి వచ్చి అప్పుడే 15 ఏళ్లు అయిపోయింది. అయినా ప్రతీ సినిమాలో తమన్నాను చూస్తే కొత్తగానే అనిపిస్తుంది. పదిహేనేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా.


ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ తన సత్తా చాటింది. తన నటన, అందంతో.. ప్రేక్షకులను కట్టి పడేస్తోంది.


పదిహేనేళ్ల వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఈ అందాల రాశి ఇప్పుడు 31వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. 1989 డిసెంబర్ 21 న ముంబైలో పుట్టింది ఈ మిల్క్ బ్యూటీ. సింధి ఫ్యామిలీకి చెందిన తమన్నా.. 16 ఏళ్ల వయసులోనే ఫస్ట్ సినిమా చాన్స్ కొట్టేసింది.


స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే సినిమా ఆఫర్ వచ్చింది. తమన్నా నటించిన మొదటి సినిమా "చాంద్ సా రోషన్ చెహరా". 2005లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 2005లోనే మంచు మనోజ్ తో కలిసి శ్రీ సినిమాలో నటించింది తమన్నా. శ్రీ సినిమా కాస్త పెద్దగా సక్సస్ సాధించకపోయినా.. తమన్నాకు ఆఫర్లు మాత్రం క్యూ కట్టాయి.


ఈ బ్యూటీకి ఫిదా అయిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదే హ్యాపీడేస్ సినిమా. ఈ మూవీతో మిల్క్ బ్యూటీ ఫాలోయింగ్ కు తిరుగులేకుండా పోయింది. భద్రీనాథ్ మూవీలో మిల్క్ బ్యూటీ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ అల్లల్లాడారు.


ఆ నడుమొంపులు.. ఎత్తులు.. పల్లాలు చూసి ఫిదా అయిపోయారు. నాజూకైన నడుమును పాములా తిప్పుతోంటే.. కుర్రకారు గుండెలదిరిపోయాయి. ఈ దెబ్బతో తమన్నాకు కోట్లాది మంది ఫ్యాన్స్ తయారయ్యారు.


ఆ తర్వాత బాహుబలి సినిమా తమన్నా క్రేజ్ ను మరింత పెంచింది. అయినా అది ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. బాహుబలి రిలీజైన ఏడాదే వచ్చిన.. విక్రమ్'స్కెచ్', కళ్యాణ్‌రామ్ 'నా నువ్వే', సందీప్ కిషన్‌తో చేసిన 'నెక్ట్స్..ఏంటి సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలాయి.


కానీ.. ఆ తర్వాత రెట్టించిన స్పీడ్ తో దూసుకొచ్చింది తమన్నా. ఎఫ్ 2 మూవీతో మళ్లీ తన క్రేజ్ ను రీ గెయిన్ చేసింది ఈ సన్నాజాజి బొమ్మ. ఫ్యామిలీ లేడీ గెటప్ లో, బికినీలో కనిపించి కుర్రకారుకు మరోసారి ఝలక్ ఇచ్చింది. త్వరలోనే ఎఫ్ 3 మూవీతో మాస్ మసాలాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


అయితే.. తమన్నా హీరోయిన్‌గా నటించిన క్వీన్ రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి' ఇంకా రిలీజ్ కాలేదు. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.





Next Story
Share it