Top
Batukamma

సిక్రెట్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వరంగల్ బ్యూటీ!

సిక్రెట్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కి  షాక్ ఇచ్చిన వరంగల్ బ్యూటీ!
X
Highlights

ఆనంది మన తెలుగు అమ్మాయి… ఇంకా పక్కాగా చెప్పాలంటే తెలంగాణ పిల్ల.. వరంగల్ లో పుట్టింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో అనే సినిమాల్లో ఓ పాటలో కనిపించింది.

ఆనంది మన తెలుగు అమ్మాయి… ఇంకా పక్కాగా చెప్పాలంటే తెలంగాణ పిల్ల.. వరంగల్ లో పుట్టింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో అనే సినిమాల్లో ఓ పాటలో కనిపించింది. ఇక బస్ స్టాప్ సినిమాలో సీమ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది..


కానీ ఆమెకి అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి.. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది..ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి చెక్కేసిన ఆ అమ్మడు మంచి అవకాశాలను దక్కించుకొని అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది..


ఇలా చాలా బిజీగా ఉన్న టైంలో పెళ్లి పీటలెక్కి అందరికి షాక్ ఇచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా... తమిళ్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న సోక్రటీస్‌ ని వివాహం చేసుకుంది.



వరంగల్ లోని ఓ రెస్టారెంట్‌లో వీరి వివాహం జరిగింది. తమ హీరోయిన్ ఇంత సడన్ గా పెళ్లి పీటలు ఎక్కడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఏంటి అప్పుడే పెళ్లి చేసుకున్నవా బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







Next Story
Share it