Top
Batukamma

Tamil tv actress vj chitra : నటి చిత్ర ఆత్మహత్య.. షాక్ లో సినీ పరిశ్రమ..!

Tamil tv actress vj chitra : నటి చిత్ర ఆత్మహత్య.. షాక్ లో సినీ పరిశ్రమ..!
X
Highlights

నటి వీజే చిత్ర(vj chitra) (28) ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకి పాల్పడడం అందరిని షాక్ కి గురి చేస్తోంది

Tamil tv actress vj chitra suicide: కోలీవుడ్ లో విషాదం నెలకొంది. తమిళ టీవీ నటి వీజే చిత్ర(vj chitra) (28) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఓ హోటల్‌లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్య పైన కోలీవుడ్ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌(pandyan stores) లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు సినిమాలలో కూడా ఆమె నటించారు.

ఆత్మహత్యకు చేసుకునే ముందు రోజు రాత్రి కుడా ఆమె ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు చిత్ర. షూటింగ్ తరవాత ఆ తెల్లవారుజామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. అనంతరం ఆమె ఆత్మహత్యకి పాల్పడడం అందరిని షాక్ కి గురిచేస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, వీజే చిత్రకి ఇటివలే ప్రముఖ బిజినెస్ మెన్ హేమంత్‌(Hemanth)తో నిశ్చితార్థమైంది. అయితే చిత్ర ఆత్మహత్య పట్ల హేమంత్ మాట్లాడుతూ.. తనకి ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదని, దీనితో అతను హోటల్ సిబ్బందికి కాల్ చేసినట్టుగా వెల్లడించాడు.

ఆ హోటల్ సిబ్బంది వాళ్ళు చిత్ర రూమ్ కి వెళ్లి పలుమార్లు తలుపులు తట్టినప్పటికీ ఎలాంటి సమాధానం లేకపోవడంతో డూప్లికేట్ తాళం చెవితో తలుపులను తెరవగా అప్పటికే చిత్ర ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్టుగా వెల్లడించాడు.

ఆమె ఆత్మహత్యకి ఆర్థిక కారణాలు కాకపోయి ఉండకపోవచ్చునని, ఇతరత్రా కారణాలు ఉంటాయని అభిమానులు అనుమానిస్తున్నారు. పలు టీవీ ఛానళ్లలో ప్రజెంటర్‌(news presenter)గా పనిచేసిన చిత్ర, ఆ తర్వాత పలు టీవీ సీరియళ్ళలో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె ఇలా ఆత్మహత్యకి పాల్పడడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.

Next Story
Share it