Top
Batukamma

దేత్తడి హారికకి షాక్... టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా తొలిగింపు.. కారణం ఇదే..!

దేత్తడి హారికకి షాక్... టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా తొలిగింపు.. కారణం ఇదే..!
X
Highlights

తెలంగాణ యాస్ తో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికని తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

నిన్న అంతతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ యాస్ తో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికని తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడీ వ్యవహారం అంతా బెడిసికొట్టింది. చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా... సీఎంవో కార్యాలయం నుండి కానీ, సంబంధిత శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండా... ఏకపక్షంగా హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారట.

దీనితో ఉప్పల శ్రీనివాస్ గుప్తాకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా నియమించరంటూ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను అధికారాలు మందలించారు. హారిక వివరాలను సంబంధింత వెబ్ సైట్ నుంచి తొలిగించారు.

గతంలో కూడా ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఇలాగే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. మరోసారి ఇలాగే రీపీట్ ఐతే ఉప్పల శ్రీనివాస్ గుప్తా పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించరని సమాచారం.

దేత్తడి హారికని తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వెనుక ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఉప్పల శ్రీనివాస్ గుప్తాకి దేత్తడి హారిక బంధువు అవుతుందని.. అందుకే ఆమెకు టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా దేత్తడి హారిక వన్ డే తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సి వచ్చింది.

Next Story
Share it