Top
Batukamma

అక్కా...నువ్వు ఏడవకక్కా... ఆ అనిల్ గాన్నీ కుమ్మేద్దాం...!

అక్కా...నువ్వు ఏడవకక్కా... ఆ అనిల్ గాన్నీ కుమ్మేద్దాం...!
X
Highlights

సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అనేది చాలా కామన్.. కానీ వాటిని నిలబెట్టుకోవడం అంటే మామలు విషయం కాదు..

సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అనేది చాలా కామన్.. కానీ వాటిని నిలబెట్టుకోవడం అంటే మామలు విషయం కాదు.. ఇదే సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద టాస్క్.. సీనియర్ నటి సావిత్రి చాలా స్టార్ హోదా చూసింది. మంచి పేరుతో పాటు డబ్బును కూడా సంపాదించుకుంది కానీ తన చివరి జీవిత ప్రయాణంలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిని ఎదురుకుంది.

ఇలాంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలానే మంది ఉన్నారు. అందులో ఒకరు సీనియర్ నటి జయలలిత... ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ పాత్రల్లో ఓ వెలుగు వెలిగిన జయలలిత చాలా డబ్బు సంపాదించి... పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో ఉంటూ ఖరీదైన కార్లతో లగ్జరీ లైఫ్‌ని చూశారు. కానీ ఓ వ్యక్తి చేసిన మోసంతో ఇప్పుడు కనీసం కారు కూడా లేకుండా.. షూటింగ్ లకి క్యాబ్ లలో వెళ్తున్నారు. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన జయలలిత తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.

జరిగిన మోసాన్ని తలుచుకుంటే తనమీద తనకే అసహ్యం వేస్తుందని.. విజయనగరానికి చెందిన కొందరు రాజులు తనని మోసం చేశారని వాపోయింది. రూ.4 కోట్లు డబ్బు తీసుకుని తనని మోసం చేశారని వాపోయింది. వాళ్లు చేసిన మోసానికి ప్రస్తుతానికి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చింది. అయితే దీనిపైన మరో సీనియర్ నటి కరాటే కళ్యాణి స్పందించారు.

" జయక్క నువ్వూ ఎంత బాధ ఉన్నా.నవ్వుతూనే ఉంటావు అలాగే సిరిమల్లె లాగానే ఉండాలి..అమ్మ ఇలా ఏడిస్తే మేము యేమైపోతము.. వాడు ఆ అనిల్ రాజు వాడి ఫ్యామిలీ దొరుకుతారు.. మనము కుమ్మెద్దాము... నీకు.కష్టాలు తొందరలో పోవాలని కోరుకుంటున్నా శ్రీరామ రక్ష love u.. ఇంకెప్పుడు ఏడవకు నేను చూడలేను" అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై జయలలిత కూడా రియాక్ట్ అయ్యారు.. థాంక్యూ తల్లీ అంటూ రిప్లయ్ ఇచ్చారు..



Next Story
Share it