Top
Batukamma

నటి ఊహ మేనమామ కూడా సినీ నటుడే.. ఎవరో తెలుసా?

నటి ఊహ మేనమామ కూడా సినీ నటుడే.. ఎవరో తెలుసా?
X
Highlights

ఆమె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నటి ఊహ(Actress Ooha).. ఈమె అసలు పేరు శివరంజని

Telugu Actress Ooha : 1994 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నటి ఊహ(Actress Ooha).. ఈమె అసలు పేరు శివరంజని. అయితే ఆమె సినిమాతో శివరంజని కాస్తా ఊహగా మారింది.

హృదయ సామ్రాజ్య అనే కన్నడ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఊహ ఆ తరవాత మలయాళ, తమిళ చిత్రాలలో నటించారు. ఇక 1994 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్(actor srikanth) హీరోగా వచ్చిన ఆమె సినిమాలో తెలుగులో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు.


ఆ తరవాత ఆయనకి ఇద్దరు, ఊహ, ఆయనగారు మొదలగు తెలుగు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో ఎక్కువగా శ్రీకాంత్ తో సినిమాలు చేయడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళికి దారితీసింది. ఈ దంపతులకి ముగ్గురు (రోషన్, మేధా, రోహన్) పిల్లలు ఉన్నారు.


ఇక ఇదిలా ఉంటే నటి ఊహ మేనమామ కూడా తెలుగులో ఓ లెజండరీ నటుడే కావడం విశేషం. ఆయనే పి.ఎల్. నారాయణ.. అయన ఆసలు పేరు పుదుక్కోటై లక్ష్మీనారాయణ.. నాటక రచయితగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1992 లో యజ్ఞం అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు.

కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు(nandi award) అందుకున్నాడు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి గాను ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు. ఇక తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3 న మరణించారు.

Next Story
Share it