Top
Batukamma

చెల్లెలి కోసం వచ్చిన అబ్బాయితో పెళ్లి... ఇక్కడ ఇంకో ట్విస్ట్... ఓపెన్ అయిన తెలుగు యాంకర్!

చెల్లెలి కోసం వచ్చిన అబ్బాయితో పెళ్లి... ఇక్కడ ఇంకో ట్విస్ట్... ఓపెన్ అయిన తెలుగు యాంకర్!
X
Highlights

అయితే అదిరింది షోతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆమెను ఆ షో నుంచి తొలిగించారు. ఇక ఇదిలా ఉంటే తన ప్రేమ గురించి కొన్ని రహస్యాలను అభిమానులతో పంచుకుంది సమీరా..

తెలుగు సీరియల్స్ తో నటిగా మంచి పేరు అయితే సంపాదించుకుంది సమీరా షరీఫ్.. కానీ ఆమెకి తగిన గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి.. అయితే అదిరింది షోతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆమెను ఆ షో నుంచి తొలిగించారు. ఇక ఇదిలా ఉంటే తన ప్రేమ గురించి కొన్ని రహస్యాలను అభిమానులతో పంచుకుంది సమీరా..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా మాట్లాడుతూ.. తనకి ఓ అక్క, ఓ చెల్లెలు ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే తన అక్కయ్య ముస్లిం కానీ... ఓ తమిళ యువకుడిని ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుందని, ఇక చెల్లలి బాధ్యత తన పైన పడిందని చెప్పుకొచ్చింది. అయితే తన చెల్లిని ఓ మంచి కుటుంబానికి ఇవ్వాలని అంతా భావించామని, అందులో భాగంగానే తన చెల్లెలి కోసం వచ్చిన కుర్రాడిని తానూ పెళ్లి చేసుకున్నట్టుగా పేర్కొంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందట.. సమీరా పెళ్లి చేసుకున్న అతను తనకంటే వయసులో 4 నెలల చిన్నవాడట..

ఇంతకీ సమీరా పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు... టాలీవుడ్ సీనియర్ నటి సన కొడుకు అన్వర్. ముందుగా అన్వర్, సమీరా ఓ షాపింగ్ మాల్ లో కలిశారట.. అక్కడ ఇద్దరికీ పరిచయం ఏర్పడిందట.. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్తూ... తను నటి సన కొడుకని చెప్పడంతో ఆమె షాక్ అయిపోయిందట... ఆ తర్వాత జరిగిన విషయం సమీరా... సనకు చెప్పిందట..

ఇక ఆ తరవాత ఫేస్ బుక్ నుంచి పరిచయం పెంచుకుంటూ ఇద్దరు సన్నిహితంగా మారారట.. అయితే వయసులో తన కంటే 4 నెలలు చిన్నోడని అన్వర్ ని తన చెల్లికి సెట్ చేయాలని అనుకుని.. చివరికి అన్వర్ మాయలో పడిపోయిందట సమీరా. మాటల మధ్యలో ఓ రోజు ప్రపోజ్ కూడా చేసిందట.. కాగా ఈ ఇద్దరు 2015లో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

Next Story
Share it