Top
Batukamma

ఫొటో పెట్టి మరీ తిట్టించుకుంటున్న తెలుగు టాప్ యాంకర్..!

Anasuya bharadwaj
X
Highlights

నిండుగా స్త్రీ బట్టలు వేసుకుంటే మహాలక్ష్మీ లా ఉంటుంది.కానీ మీరు ఇలా తయారయ్యారు ఎందుకో

Anasuya bharadwaj: ప్రస్తుతం తెలుగు టీవీ ఛానల్స్ లో హాట్ ఫేవరేట్ యాంకర్ అంటే అనసూయనే. సుమలాంటి టాప్ మోస్ట్ యాంకర్లు ఉన్నా... అనసూయకు ఉన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే అనసూయ(Anasuya) తన యాంకరింగ్ తోనే కాదు.. అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఏజ్ బార్ అయినా కొద్ది.. అందంలో డోస్ పెంచుతూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతోంది అనసూయ. అనసూయ అంగాంగ ప్రదర్శన చేయడం ఇదేం కొత్త కాదు.

జబర్ధస్త్ షో(jabardasth) క్రేజ్ తగ్గుతోంది.. రేటింగ్ లో తేడా వస్తోందని అనుమానం వచ్చిన ప్రతీసారి ఇటు అనసూయ, అటు రష్మి బట్టల సైజు ఆటోమెటిక్ గా తగ్గిపోతుంది.

అయితే.. అందులోనూ అనసూయ స్థాయిలో గ్లామర్ ఒలకబోయడం రష్మి వల్ల కూడా కావడం లేదు. తన అందాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది అనసూయ.

జబర్దస్త్ లెటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి అనసూయ ఓ ఫొటో పోస్ట్ చేసింది. షర్ట్ మాత్రమే వేసుకుని ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

అనసూయ వేసుకున్న షర్ట్ కారణంగా సోషల్ మీడియాలో తిట్లు, సమర్థింపుల యుద్ధం నడుస్తోంది.

"ఎదో చూపించాలి అని ప్రయత్నిస్తున్నట్టు ఉంది...మంచిగా కిందకుడా ఏమైనా వేసుకోవాల్సింది.

నిండుగా స్త్రీ బట్టలు వేసుకుంటే మహాలక్ష్మీ లా ఉంటుంది.కానీ మీరు ఇలా తయారయ్యారు ఎందుకో.." అని అనసూయ అభిమాని ఒకరు ఫొటో కింద కామంట్ పెట్టారు.

"డబ్బు ఉన్నవాళ్ళు emo chinigipoyina బట్టలు ఏసుకొని తీరుగుతారు, పెదవాళ్లు ఎమో ఉన్న రెండు jathala బట్టలు chirigina chota kuttukoni mari వేసుకుంటారు. ఇందులో పెదవాళ్లు గొప్ప, ఉన్నవాళ్ళు గొప్ప ane vishayanni ప్రక్కలో పెడితే, youth nu manchi బాటలో నడిపే mature persons, షెలెబ్రెటీలు ఈలాంటి పనికి రాని postlu పెట్టి em message isdam అనుకుంటున్నారా.." అని మరో అభిమాని ప్రశ్నిస్తున్నారు.

"మీరు ఇలాగే ఉండండి. తగ్గకంది. మళ్లీ మనోళ్లు మాటలు విని పూర్తి బట్టలు వేసుకుంటే మా లాంటివారు నిరాశ పడుతారు. ఇంకొంచెం చిన్నవి వేసినా చూస్తాం. అంత ఇష్టం మరి మీరు అంటే. ఎవరు ఏమి అన్నా కూడా పట్టించుకోవద్దు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే చూపించండి. దయచేసి…" అంటూ మరో అభిమాన అనసూయ(anasuya)పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇక మరికొందరైతే ఈ టీవీ తీరును తప్పుపడుతున్నారు. Trp రేటింగ్ ల కోసం ఎంతకైనా దిగజారుతారా..? మరి ఇలా శరీర ప్రదర్శన చేయించి డబ్బులు సంపాదించుకోవాలా..? అని విమర్శిస్తున్నారు.


అయితే.. విమర్శలు చేసే వారికి కొందరు కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు బట్టలు వాళ్లు వేసుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటీ..? వేసుకునే బట్టలను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా..? అంటూ నెగెటివ్ కామెంట్లు పెట్టే వారికి చీవాట్లు పెడుతున్నారు.

ఇంకొందరైతే.. ఇవాళ్టి జబర్దస్త్ ఎపిసోడ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దని కామెంట్స్ పెడుతున్నారు. ఎపిసోడ్ మిస్సైతే చాలా మిస్సైపోతామంటూ.. ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు.

అయితే.. ఇంతలా అనసూయతో పొట్టి బట్టలు వేయించిన మల్లెమాల(mallemala) మాత్రం... ప్రోమోలో మాత్రం చాలా జాగ్రత్తపడింది. ఎక్కడా అనసూయను హైలైట్ చేయకుండా.. అనసూయ కనిపించినా నడుం వరకే కనిపించేలా ఎడిటింగ్ లో సెట్ చేసేసింది.

- Horoscope today telugu : 17-12-2020 గురువారం నేటి రాశిఫలాలు

Next Story
Share it