ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. పోయేది ఆ ఇద్దరే?

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో పదకొండు మంది ఉండగా, ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు .
Biggboss telugu eliminations : బుల్లితెర పైన ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ 4 ఎనిమిదో వారానికి చేరుకుంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో పదకొండు మంది ఉండగా, ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు .
నామినేట్ అయినా వారిలో అమ్మ రాజశేఖర్, అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానాలు ఉన్నారు. అయితే ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా అఖిల్, లాస్య, అరియానా సేఫ్ జోన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక డేంజర్ జోన్ లో మోనాల్, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ఉన్నారు.
అయితే మోనాల్ బిగ్ బాస్ దత్తపుత్రిక కావడంతో ఆమెను ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు... సో ఎప్పటిలాగే ఈ వారం కూడా మోనాల్ సేవ్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.. ఇక మిగిలింది అమ్మ రాజశేఖర్, మెహబూబ్ కాబట్టి ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీరు ఇంటి నుంచి వెళ్ళడం పక్కా అని అంటున్నారు..
సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అమ్మ రాజశేఖర్ వెళ్ళడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు మెహబూబ్ నామినేషన్ లోకి వస్తాడా అని బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.. సో డబుల్ ఎలిమినేషన్ (Biggboss telugu eliminations) ఉంటే మెహబూబ్ వెళ్ళే ఛాన్స్ పక్కా అంటున్నారు.