Top
Batukamma

సినీ ప్రముఖుల వరదసాయం :థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

సినీ ప్రముఖుల వరదసాయం :థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
X
Highlights

ముఖ్యమంత్రి పిలుపుతో సినీ ప్రముఖులు కదిలివచ్చారు. సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటించారు.

హైదరాబాద్ ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. వారిని కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలివ్వాలని కోరారు.

ముఖ్యమంత్రి పిలుపుతో సినీ ప్రముఖులు కదిలివచ్చారు. సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇతరులు పెద్ద సంఖ్యలో విరాళాలివ్వాలని కోరారు.

నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ తలా 50 లక్షలు.. విజయ్ దేవరకొండ 10 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. త్రివిక్రమ్, హారిక హాసిని ప్రొడక్షన్ 20 లక్షల విరాళం ప్రకటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ 5లక్షలు, అనిల్ రావిపూడి 5లక్షల విరాళం ఇస్తామని చెప్పారు.

అలాగే.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా రాష్ట్రానికి సాయం ప్రకటించారు. 15కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్ తో పాటు.. సినీ ప్రముఖుల సాయానికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.

Next Story
Share it