Top
Batukamma

గ్రేట్ సంపూ.. సినిమాలు లేకున్నా వరద బాధితులను అదుకున్నావ్!

గ్రేట్ సంపూ.. సినిమాలు లేకున్నా వరద బాధితులను అదుకున్నావ్!
X
Highlights

హైదరాబాదు నగరంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకి నగర ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఈ భారీ వర్షాలకి ఎంతో ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే వరద భాదితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ ముందుకు వస్తున్నారు.

హైదరాబాదు నగరంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకి నగర ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఈ భారీ వర్షాలకి ఎంతో ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే వరద భాదితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ మొదలుగు వారు విరాళాలు ప్రకటించారు.

తాజాగా సినీ హీరో సంపూర్ణేష్ బాబు వరుద భాదితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. తన వంతు సహాయంగా 50వేల రూపాయ‌ల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అంద‌జేశాడు సంపూ.. దీనికి సంబంధించిన చెక్కును ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు అందజేశాడు సంపూ.. లాక్ డౌన్ పరంగా సినిమాలు లేకపోవడంతో సంపూ తన సొంత ఊరిలోనే కులవృత్తి చేసుకుంటున్నాడు.

సినిమాలు లేకపోయినప్పటికీ మానవత దృక్పథంతో తోటివారిని ఆదుకోవడానికి సంపూ ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయం కూడా.. ఇలాంటి విపత్కర సందర్బాలు వచ్చినప్పుడు సంపూ ముందుకు వచ్చి తనకి ఉన్నంతలో సహాయం చేస్తున్నాడు. సంపూని చూసి మిగతా నటులు ముందుకు వస్తారని ఆశిద్దాం.. గ్రేట్ సంపూ...

అటు హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలకి నగరంలోని చాలా కాలనీలు మునిగిపోయాయి.. దీనితో నగర వాసులు బయటకు రావడానికి భయపడుతున్నారు. అటు కార్లు, బైకులు కూడా మునిగిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it