అబ్బా అనిపించిన హేబ్బాను పక్కాన పెట్టేసిన ఇండస్ట్రీ!

ఇండస్ట్రీలో ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే.. హిట్ వచ్చిందా ఇండస్ట్రీలో ఉంటాం.. లేకపోతే తట్టాబుట్టా సర్దుకొని వెళ్లాల్సిందే.
ఇండస్ట్రీలో ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే.. హిట్ వచ్చిందా ఇండస్ట్రీలో ఉంటాం.. లేకపోతే తట్టాబుట్టా సర్దుకొని వెళ్లాల్సిందే. కుమారి 21 F సినిమాతో కుర్రకారుతో అబ్బా అనిపించినా హెబ్బాను ఇప్పుడు ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది.
ఈ సినిమాతో వరుస అవకాశలు ఆమెకి వచ్చాయి. నిఖిల్, సిద్ధార్థ్ లతో సినిమాలు చేసింది హేబ్బా.. అయితే ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో హేబ్బాను హీరోయిన్ గా పక్కన పెట్టేసింది ఇండస్ట్రీ.
దీనితో అరుణ్ ఆదిత్తో '24 కిస్సెస్'లో బోల్డ్ పర్ఫార్మెన్స్తో యూత్‌కి మరోసారి కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో సినిమా మళ్ళీ హేబ్బా కథ మొదటికి వచ్చింది.
హీరోయిన్ గా అవకాశాలు లేకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలు పెట్టింది. నితిన్ 'భీష్మ'లో చిన్న క్యారెక్టర్, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగాలో మెరిసినప్పటికి అది ఆమె కెరీర్‌కు బూస్టప్ ఇవ్వలేకపోయింది.
ఈ టైంలో కృతి శెట్టి, నేహ శర్మ, కేతిక శర్మ లాంటి హీరోయిన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో హేబ్బాను ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. అయితే హేబ్బా ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్దమైందని తెలుస్తోంది.