Top
Batukamma

త్రివిక్రమ్ లవ్ స్టొరీ కిరాక్.. అక్క కోసం వెళ్లి చెల్లిని పెళ్లి..!

త్రివిక్రమ్ లవ్ స్టొరీ కిరాక్.. అక్క కోసం వెళ్లి చెల్లిని పెళ్లి..!
X
Highlights

అయితే వీరి పెళ్లి వెనుక కూడా ఆసక్తికరమైన లవ్ స్టొరీ ఉందట.. వాస్తవానికి త్రివిక్రమ్ పెళ్లి చేసుకోవాల్సింది సౌజన్య అక్కయ్యని..ఆమెను చూడడానికి పెళ్లి చూపులకి కూడా వెళ్ళాడు మన మాటల మాంత్రికుడు..

తేలికైన పదాలతో ఎంతో అర్ధవంతమైన సంబాషణలు చెప్పడంలో త్రివిక్రమ్ కి ఎవరు పోటిలేరు. అందుకే ఆయనని మాటల మాంత్రికుడని అంటారు. నువ్వే కావాలి సినిమాతో రైటర్ గా మొదలైన అయన సినీ ప్రయాణం.. ఇప్పుడు టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు. అయితే త్రివిక్రమ్ సినిమాల గురించి అయన డైలాగ్ ల గురించి తెలిసినంతగా అయన వ్యక్తిగత విషయాలు ఎవరికీ తెలియదు.

త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగశ్రీనివాస్ శర్మ.. భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్ డి.ఎన్.ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. ఇందులో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఆ తరవాత అదే కాలేజీలో టీచర్ గా కూడా పనిచేశాడు. అయితే ముందునుంచి సినిమాల పైన, సాహిత్యం పైన మంచి ఆసక్తి ఉండడంతో సినిమాలలో పనిచేయాలని అనుకున్నాడు. కానీ తోడుగా ఎవరు కూడా లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు.

అయితే అప్పటికే భీమవరం నుంచి సినిమాలలో విలన్ గా ట్రై చేస్తున్న సునీల్ కి మరొక స్నేహితుడితో త్రివిక్రమ్ పరిచయం అయ్యాడు. అలా ఇద్దరు కలిసి లకిడికపూల్ లో రూమ్ తీసుకొని సినిమాల కోసం వేట మొదలుపెట్టారు. అయితే ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయడానికి ఇష్టపడని త్రివిక్రమ్.. దర్శకుడిగా మెలుకువలు నేర్చుకోవడానికి పోసాని దగ్గర రైటర్ గా చేరాడు. అక్కడ గోకులంలో సీత మొదలుగు సినిమాలకి రైటర్ గా పనిచేశాడు.

ఆ తర్వాత విజయభాస్కర్ తో పరిచయం నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వరుకు తీసుకెళ్ళింది. ఆ తరవాత నువ్వే నువ్వే సినిమాతో త్రివిక్రమ్ డైరెక్టర్ అయిపోయాడు. అతడు, జులాయి, అత్తారింటికి దారేది. అల వైకుంఠపురములో సినిమాలతో టాప్ 3 డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు. అయితే త్రివిక్రమ్ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు. సిరివెన్నల సీతారామశాస్త్రీ తమ్ముడి కూతురు సౌజన్యని..


అయితే వీరి పెళ్లి వెనుక కూడా ఆసక్తికరమైన లవ్ స్టొరీ ఉందట.. వాస్తవానికి త్రివిక్రమ్ పెళ్లి చేసుకోవాల్సింది సౌజన్య అక్కయ్యని..ఆమెను చూడడానికి పెళ్లి చూపులకి కూడా వెళ్ళాడు మన మాటల మాంత్రికుడు.. అయితే అక్కడ సౌజన్య నచ్చడంతో అందరి ముందు అదే విషయాన్నీ చెప్పేశాడట త్రివిక్రమ్.. దీనితో అందరూ ఆశ్చర్యపోయారట.. అయితే మంచి సంబంధం, సీతారామశాస్త్రికి బాగా నచ్చిన వ్యక్తి కావడం, ఎలాంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి కావడంతో వారు కూడా ఒప్పుకున్నారట!

అయితే పెద్ద అమ్మాయి పెళ్లి అయ్యాకే ఈ పెళ్లి చేస్తామని సౌజన్య తల్లిదండ్రులు చెప్పారట.. అలా సంవత్సరం తర్వాత త్రివిక్రమ్, సౌజన్యని మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story
Share it