ఏంటయ్యా త్రివిక్రమ్..? గురువు గారు.. గురువు గారూ.. అంటే ఇదా నువ్ చేసేది..?

మన దగ్గర ఉన్నంతమంది కాపీ క్యాట్ లు మరెక్కడా ఉండదనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నమాట.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి(tollywood) ఓ ప్రత్యేకమైన పేరుంది. మన దగ్గర ఉన్నంతమంది కాపీ క్యాట్ లు మరెక్కడా ఉండదనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నమాట.
కొత్త సినిమా రావాలంటే నాలుగు హాలీవుడ్(Hollywood) సినిమా సీడీలు చూసేస్తే సరి అని.. ఎప్పటి నుంచో ఓ జోక్ ప్రచారంలో ఉంది. అంతలా.. హాలీవుడ్, కొరియన్(Korean), చైనీస్(Chinese).. ఇలా ప్రపంచంలోని అన్ని ఇండస్ట్రీల సినిమాలను మన దగ్గర దించేస్తారు.
ఇలా పక్కదేశం స్టోరీలను యాజీటీజ్ గా దించేయడంలో తనకు తానే సాటి అనే స్థాయిలో ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas). డైలాగులతో జనాన్ని మెస్మరైజ్ చేసే ఈ డైరెక్టర్.. సినిమాలోని సీన్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడి నుంచి ఎత్తుకొచ్చేస్తున్నారు.
అప్పుడెప్పుడో వచ్చిన ఖలేజా(khleja movie) సినిమాలోని ఓ సీన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. విలన్ ప్రకాశ్ రాజ్ పెట్టబోయే ఫ్యాక్టరీకి సంబంధించి జరిగే డిస్కషన్ ను యాజిటీజ్ గా డైలాగులు స్క్రీన్ ప్లే తో సహా యథావిధిగా దించేశాడు. జస్ట్ క్యారెక్టర్లు మారిపోయాయి అంతే.
కావాలంటే మీరూ చూసేయండి.