Top
Batukamma

నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న బెబమ్మ.. రేటు భీభత్సంగా పెంచేసింది...!

నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న బెబమ్మ.. రేటు భీభత్సంగా పెంచేసింది...!
X
Highlights

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది అన్నది సామెత.. ఈ సామెతలు మన హీరోయిన్స్ బాగా ఫాలో అవుతుంటారు. మంచి హిట్ రాగానే రెమ్యునరేషన్ పెంచేస్తూ ఉంటారు.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది అన్నది సామెత.. ఈ సామెతలు మన హీరోయిన్స్ బాగా ఫాలో అవుతుంటారు. మంచి హిట్ రాగానే రెమ్యునరేషన్ పెంచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరిపోయింది బెబమ్మ.. అలియాస్ కృతిశెట్టి...

ఉప్పెన సినిమాతో అనూహ్యంగా తెరపైకి దూసుకువచ్చిన ఈ అమ్మడు.. రిలీజ్ కి ముందే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ యూత్ లో పిచ్చ క్రేజ్ సంపాందించుకుంది. ఇక సినిమాలో నటనతో అందర్నీ కట్టిపడేసింది.

దీనికి తోడు రిలీజ్ కి ముందే మెగాస్టార్ చిరంజీవి ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కృతిశెట్టి వైపే చూస్తుంది. దీనితో ఆమెకి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఉప్పెన సినిమాకి రూ.ఆరు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న బెబమ్మ... సినిమా సక్సెస్ తరవాత అమాంతం రేటు పెంచేసిందని టాక్..

తదుపరి చేయబోయే చిత్రాలకు గాను రూ. 80 లక్షలు డిమాండ్ చేస్తుందట.. ఒక్క సినిమా హిట్ కే ఇంత పారితోషకం. పెంచేసిందా అని సినీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయట.. అయితే మంచి అందం, నటన కూడా ఉండడంతో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట.

Next Story
Share it